Breaking News

ఇప్పుడు ఎలాంటి స్మార్ట్‌ఫోన్లు కావాలంటే..

Published on Sun, 08/23/2026 - 09:09

ఏఐ ఫీచర్లు ఇప్పుడు 82% స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలుదారుల ఎంపికను  ప్రభావితం చేస్తున్నాయి. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్, బ్యాటరీ జీవిత కాలం, కెమెరా సామర్థ్యం వంటివి వరుసగా నిలిచాయి. స్మార్ట్‌ ఫోన్‌ ఎంపికలో వినియోగదారులపై ప్రభావం చూపుతున్న అంశాలపై అధ్యయనాన్ని బెస్ట్‌ ఇన్‌టెక్‌ సర్వే పేరిట అమెజాన్‌ డాట్‌ ఇన్‌ నిర్వహించింది.

హైదరాబాద్‌తో పాటు పలు చిన్న, మధ్య తరహా పట్టణాల వ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాల ప్రకారం.. 87% మంది. పెర్ఫార్మెన్స్‌ వేగం 79% మంది బ్యాటరీ జీవిత కాలం 77% మంది నాణ్యతలను కోరుకుంటున్నారని ఏఐ రాకతో వినియోగదారుల ప్రాధాన్యతల్లో ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని అమెజాన్‌ ఇండియా. కంజ్యూమర్‌ ఎల్రక్టానిక్స్, డైరెక్టర్, జేబా ఖాన్‌ అభిప్రాయపడ్డారు

రేటింగ్స్‌కే ప్రథమ ప్రాధాన్యం.. 
దిగువ మధ్యతరగతి, పేద జనాభా ఎక్కువగా ఉండే మన దేశంలో రూ.15వేల లోపు ధర కలిగిన ఫోన్లకు 7 శాతం మాత్రమే ఎంచుకుంటున్నారని అధ్యయనం వెల్లడించడం విశేషం. అత్యధిక డిమాండ్‌ (42 శాతం మంది) రూ.25 వేల నుంచి రూ.50 వేల మధ్య ధర కలిగిన ఫోన్లకు ఉందని, రూ.75 వేల లోపు ఖరీదు చేసే ఫోన్లను 15 శాతం మంది, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఫోన్లను 17 శాతం మంది ఎంచుకుంటున్నారు.

రూ.15వేల నుంచి రూ.25 వేల మధ్య ధర కలిగిన ఫోన్లను 19 శాతం మంది ఓటేశారు. ఫోన్‌ వినియోగదారుల్లో 54శాతం మంది తమ ఫోన్లను రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగిస్తున్నారు. వచ్చే మూణ్నెళ్లలో ఫోన్‌ మారుస్తామని 48 శాతం మంది చెప్పారు. ఫోన్ల ఎంపికలో డిస్కౌంట్ల కంటే రేటింగ్స్‌కే వీరు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. కొనుగోలు చేసేటప్పుడు రేటింగ్స్‌కి మొదటి ప్రాధాన్యమిస్తామని 47శాతం మంది చెప్పగా, డిస్కౌంట్లు, బెస్ట్‌ డీల్స్‌కే ఓటేస్తామని 35శాతం మంది వెల్లడించారు.

ఇదీ చదవండి: జియో రీచార్జ్‌ ప్లాన్‌: 98 రోజులు అదిరిపోయే బెనిఫిట్స్‌!

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)