Breaking News

భయంకరమైన భవిష్యత్తు! రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా?

Published on Sat, 02/07/2026 - 14:38

వైట్‌ కాలర్‌ ఉద్యోగాలకు గడ్డుకాలం మొదలైందా? రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా? విజృంభిస్తున్న ‘ఏఐ(AI) మహమ్మారి’ మానవ ఉద్యోగాలను మింగేస్తోందన్న భయాలు నిజమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఐటీ దిగ్గజాలను సైతం వణికిస్తున్న ‘ఆంథ్రోపిక్’ సీఈవో డారియో అమోడేయి చేసిన తాజా హెచ్చరికలు ఉద్యోగ మార్కెట్ భవిష్యత్తుపై భయాన్ని రేకెత్తిస్తున్నాయి.

ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర పతనం
అమోడేయి వ్యాఖ్యల తర్వాత విడుదలైన యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాలు ఆయన అంచనాలకు అనూహ్యంగా సరిపోలడం ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. తాజా లేబర్ డేటా ప్రకారం.. గత డిసెంబర్‌ ఆఖరు నాటికి అమెరికాలో ఉద్యోగ ఖాళీలు 65.4 లక్షలకు పడిపోయాయి.  2020 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం.

ఏఐ వల్ల భారీ ఉద్యోగ నష్టం
జనవరి చివరలో అమోడేయి “ది అడోలెసెన్స్ ఆఫ్ టెక్నాలజీ” అనే పేరుతో సుమారు 20,000 పదాల సుదీర్ఘ వ్యాసాన్ని ప్రచురించారు. అందులో ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇవీ..

“రాబోయే 1–5 సంవత్సరాల్లో ఏఐ వల్ల ఎంట్రీ-లెవల్ వైట్‌ కాలర్ ఉద్యోగాల్లో 50 శాతం వరకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు, 1–2 సంవత్సరాల్లో మనుషుల కంటే ఎక్కువ సామర్థ్యం గల ఏఐ కూడా సాధ్యమే”

2021లో ఆంథ్రోపిక్‌ను సహ-వ్యవస్థాపకుడిగా స్థాపించిన అమోడేయి, ఏఐ అభివృద్ధి వేగం కారణంగా లేబర్ మార్కెట్‌లో ‘అసాధారణ, బాధాకరమైన షాక్’ తప్పదని హెచ్చరించారు.

“ఏఐ పురోగతి వేగం గతంలో వచ్చిన ఇతర సాంకేతిక విప్లవాల కన్నా వేగంగా ఉంది. ఉద్యోగం చేసే విధానం మారడమే కాదు, కొత్త ఉద్యోగాలకు మారాల్సిన అవసరం కూడా ప్రజలకు తీవ్ర సవాల్‌గా మారుతుంది”

ఏఐ ఏదో ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయడం కాదు.. ‘మానవ కార్మిక శక్తికే ప్రత్యామ్నాయం’గా మారుతోంది’ అని ఆయన స్పష్టం చేశారు. న్యాయ శాఖ, ఫైనాన్స్, కన్సల్టింగ్‌ వంటి రంగాలు కూడా దీని ప్రభావానికి లోనవుతాయని హెచ్చరించారు.

తరువాత ఎన్‌బీసీ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ, ఉద్యోగ మార్కెట్‌పై ఏఐ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని ఆయన తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు.

నియామకాలు కనిష్టానికి.. తొగింపులు గరిష్టానికి..
ఈ వారం విడుదలైన తాజా డేటా, కోవిడ్‌-19 మహమ్మారి తర్వాత ఉద్యోగ మార్కెట్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభాన్ని సూచిస్తోంది. 2025 డిసెంబర్ చివరి నాటికి ఉద్యోగ ఖాళీలు మళ్లీ 65.4 లక్షలకే పరిమితమయ్యాయి. అదే రోజు విడుదలైన ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ నివేదిక ప్రకారం.. జనవరిలో యూఎస్‌ కంపెనీలు కేవలం 5,306 నియామక ప్రణాళికలను మాత్రమే ప్రకటించారు. 2009 నుంచి డేటా సేకరణ ప్రారంభించిన తర్వాత ఇదే అత్యల్ప సంఖ్య.

ఇదిలా ఉండగా, జనవరి 31తో ముగిసిన వారంలో 2.31 లక్షల మంది తాము నిరుద్యోగులుగా ఉన్నట్లు క్లెయిమ్‌ చేశారు. ఇది గత వారంతో పోలిస్తే  22,000 పెరుగుదల. అమెజాన్, యూపీఎస్ వంటి సంస్థలు ప్రకటించిన భారీ తొలగింపులు ఈ జనవరిని గ్రేట్ రిసెషన్ తర్వాత మళ్లీ అంత చెత్త నెలగా మార్చాయని ఛాలెంజర్ నివేదిక పేర్కొంది.

నెలవారీ గణాంకాల ప్రకారం.. జనవరిలో యూఎస్ కంపెనీలు 1,08,435 ఉద్యోగ కోతలను ప్రకటించాయి. ఇది డిసెంబర్‌తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ కాగా,  2025 జనవరితో పోలిస్తే రెండింతలకుపైగా ఉంది. ఈ తొలగింపుల్లో అమెజాన్, యూపీఎస్ సంస్థల వాటా 40 శాతం. రవాణా, టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, రసాయనాలు, ఆర్థిక రంగాల్లో ఈ కోతలు ఎక్కువగా నమోదయ్యాయి.

ఏఐ పాత్ర ఎంతవరకు?
ఏఐ కారణంగా నేరుగా 7,624 ఉద్యోగ కోతలు జరిగినట్లు నివేదిక పేర్కొంది. అయితే, “తొలగింపులపై ఏఐ ప్రభావం ఎంతవరకు ఉందో ఖచ్చితంగా చెప్పడం కష్టం” అని ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ ఛీఫ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ ఆండీ ఛాలెంజర్ చెప్పారు. అయినా, చాలా సంస్థలు ఏఐ అమలుపై దృష్టి పెడుతున్నాయని, మార్కెట్ కూడా ఏఐని ప్రస్తావించే కంపెనీలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Videos

రాజు ఎక్కడున్నా రాజే.. చెన్నైలో వైఎస్ జగన్ ప్రభంజనం

నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని ములాఖత్ లో కలిసిన చెవిరెడ్డి

రాంబాబు భౌతికకాయానికి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ నేతలు

పవన్ కల్యాణ్ ఇప్పుడే గుర్తొచ్చారా? అంబటి మౌనిక అదిరిపోయే రిప్లై

50 మంది విద్యార్థులకు అస్వస్థత.. రంపచోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలింపు

సౌందర్యతో సినిమా నా జన్మ ధన్యమైంది.. 365 రోజులు ఆడిందంటే నేనే నమ్మలేదు

ఈ నెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తిరుమల లడ్డు ప్రసాదంపై ది వైర్ వెబ్ సైట్ సంచలన కథనం

చంద్రబాబు, పవన్ కుట్రలు చేస్తున్నారు.. కూటమిలో భయం మొదలైంది

టీడీపీ నేతలే షాక్ అయ్యేలా ఎల్లో భజన చేస్తున్న జనసేన బ్యాచ్

Photos

+5

వైట్ టాప్ లో టాప్ లేపుతున్న జాక్వెలిన్.. గ్లామర్ (ఫొటోలు)

+5

సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈజలపాతం తెలుసా.. కదిలే వంతెనలు..అదిరే గుండెలు (ఫొటోలు)

+5

కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సాయి పల్లవి, శ్రీలీల (ఫొటోలు)

+5

అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)

+5

ఐస్‌క్రీం ఈవెంట్ లో సినీ నటి రీతూవర్మ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఆభరణాల ప్రదర్శనలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)

+5

హైదరాబాద్ : షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ (ఫొటోలు)