Breaking News

నీళ్లను తెగ తాగేస్తున్న చాట్ జీపీటీ!

Published on Wed, 05/31/2023 - 19:35

చాట్‌జీపీటీ  సాంకేతిక రంగంలో అద్భుతాలే సృష్టిస్తోంది. మనుషుల మాదిరిగా ప్రశ్నలకు జవాబులిస్తూ ‘ఔరా’ అనిపిస్తోంది. అయితే ఇప్పుడీ టెక్‌ బాట్‌ పీపాలకు పీపాలకు నీళ్లు తాగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే నీటి కరువుకు దారి తీస్తుందేమోనని అమెరికన్‌ సైంటిస్ట్‌లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మీరు అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం తడుముకోకుండా ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టేలా సమాధానం చెప్పే చాట్‌జీపీటీ నిర్వహణ భారం ఎక్కువగా ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముఖ‍్యంగా, ఒక యూజర్‌ అడిగిన 20 నుంచి 50 ప‍్రశ్నలకు సమాధానం చెప్పాలంటే అరలీటర్‌ (500 ఎంఎల్‌) నీటిని వినియోగిస్తుంది. విద్యుత్తు ఉత్పత్తికి, సర్వర్లను చల్లబరిచేందుకు అవసరమయ్యే నీటి వినియోగాన్ని లెక్కగట్టి శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. 

నీరు లేకపోతే ఉనికిని కోల్పోతుంది
కృత్రిమ మేధ (AI) నీరు లేకపోతే ఉనికిని కోల్పోతుంది. భారీ సర్వర్ గదులను చల్లబరచడానికి నేరుగా నీటిని ఉపయోగిస్తుంది. ఆ సర్వర్‌లకు పవర్ స్టేషన్‌ల నుంచి ఉత్పత్తి అయ్యే కరెంట్‌ను పరోక్షంగా ఉపయోగిస్తుంది. అలా నీరు వినియోగం భారీ స్థాయిలో కొనసాగుతున్నట్లు పలు నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. 

నీటి వినియోగంలో ముందంజ
సాంకేతిక విభాగంలో ప్రాచుర్యం పొందిన కృత్తిమ మేధ చాట్‌ బాట్‌ ‘చాట్‌జీపీటీ, బార్డ్‌లు నీరు లేకుండా పనిచేయలేవు. అవి పని చేయాలంటే సర్వర్లు 10-27 డిగ్రీల సెల్సియస్ కూలింగ్‌ ఉండాలి. ఆ కూలింగ్‌ను కొనసాగించేందుకు సర్వర్‌ల వద్ద కూలింగ్ టవర్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. సర్వర్లు వినియోగించే ప్రతి యూనిట్ (కిలోవాట్) విద్యుత్ కోసం, కూలింగ్ టవర్లు ఒక గాలన్ (3. 8 లీటర్లు) నీటిని ఉపయోగిస్తాయి.

కూలింగ్‌ టవర్లు ఎలా పనిచేస్తాయి
కూలింగ్‌ టవర్లు గదిలోని ఉష్ణోగ్రత ఆధారంగా పనిచేస్తాయి. నీరు ఆవిరైనప్పుడు పరిసరాల నుండి వేడిని గ్రహిస్తుంది. ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కూలింగ్ టవర్ లోపల నీటి ఆవిరి పెరిగి వాతావరణంలోకి విడుదలవుతుంది. ఫలితంగా, డేటా సెంటర్లు ఉపయోగించే నీరు తగ్గిపోతుంది. ఆ నీటిని రీసైకిల్ చేసేందుకు వీలు లేదు. దీంతో నీటి వినియోగం భారీగా ఉందని నివేదికలు పేర్కొన్నాయి.

మరిన్ని విశేషాలు

►20 - 50 ప్రశ్నలకు సమాధానం ఇచ్చే చాట్‌ జీపీటీ కనీసం అరలీటర్‌ మంచినీరు వినియోగించాల్సి వస్తుంది

►టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా నిర్వహించే డేటా సెంటర్‌లో  7లక్షల లీటర్ల మంచి నీటి వినియోగం జరుగుతోంది. ఆ కేంద్రంగా ఓపెన్‌ ఏఐ సంస్థ జీపీటీ-3 మోడల్‌పై పనిచేస్తోంది. కరెంట్‌ వినియోగం కారణంగా 2.8 మిలియన్‌ లీటర్ల నీళ్లను ఉపయోగించుకోవాల్సి వస్తుంది. 

►ఒక్క అమెరికాలో జీపీటీ-3 ‘3.5 మిలియన్‌ లీటర్ల నీటిని ఉపయోగిస్తుండగా.. ఏసియా, పసిపిక్‌ దేశాలతో కలిసి 4.9 లీటర్లను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. 

►జీపీటీ-3 కంటే తాజాగా విడుదలైన చాట్‌జీపీటీ - 4 నీటి అవసరం ఎక్కువగా ఉంది

చదవండి👉 చాట్‌జీపీటీ వినియోగంపై పోటీపడుతున్న సీఈవోలు.. ఏం జరుగుతుందో.. ఏమో!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)