Breaking News

దేశంలో తొలి ఏఐ ఆధారిత డిజిటల్ హెల్త్ సెంటర్

Published on Mon, 07/21/2025 - 21:40

చెన్నై: ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఒక ప్రధాన అడుగు పడింది. దేశంలో తొలి ఏఐ ఆధారిత డిజిటల్ హెల్త్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఇందు కోసం లైఫ్ సైన్సెస్ పై దృష్టి సారించిన ఏఐ కంపెనీ అజిలిసియం, శ్రీ రామచంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (SRIHER) అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.

మెరుగైన రోగ నిర్ధారణ, వ్యక్తిగతీకరించిన చికిత్స, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ కోసం ఏఐ ఆధారిత సాధనాలను అభివృద్ధి చేయడం, డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్, డిజిటల్ ట్విన్స్, స్మార్ట్ హాస్పిటల్ టెక్ వంటి డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ రూపొందించడం క్లినికల్ డేటా నాణ్యత, ఇంటర్ ఆపరేబిలిటీ, పరిశోధన సంసిద్ధతను మెరుగుపరచడానికి క్లీన్ హెల్త్ డేటా ఇనిషియేటివ్‌ను క్రియేట్‌ చేయడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలు.

ఒప్పందంలో భాగంగా ఏఐ టూల్స్, జీఎన్ఏఐ, డేటా సైన్స్, అనలిటిక్స్ వంటివి అగిలిసియం సంస్థ సమకూర్చనుండగా రామచంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్లినికల్ డేటాసెట్లు, డొమైన్ నిపుణులు, ఆసుపత్రి వాతావరణం వంటివి కల్పించనుంది. వీటితోపాటు అకడమిక్ సహకారంలో భాగంగా హెల్త్ కేర్ లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. ఔషధ ఆవిష్కరణ, రోగనిర్ధారణ, రోగి సంరక్షణలో భవిష్యత్తు ప్రతిభకు శిక్షణ ఇవ్వనుంది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)