Breaking News

ఈపీఎఫ్‌ఓ కనీస పెన్షన్‌ పెంపు..?

Published on Thu, 09/11/2025 - 12:05

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అక్టోబర్ 10-11 తేదీల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు తీపికబురు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మీటింగ్‌కు సంబంధించిన ఎలాంటి ఎజెండా ఇంకా ఖరారు కాలేదు. కొన్ని సంస్థలు, ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఇందులో కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందులోకి అంశాలు కింది విధంగా ఉన్నాయి.

ఏటీఎం ద్వారా విత్‌డ్రా..

ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థకు బ్యాంకు లాంటి కార్యాచరణను తీసుకురావనే ప్రణాళికలున్నాయి. ఇందులో ఏటీఎంల ద్వారా పాక్షిక ఉపసంహరణలను అనుమతించడం, యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రారంభించడం వంటివి ఉన్నాయి. 8 కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పదవీ విరమణ పొదుపును ఎలా నిర్వహిస్తారనే దానిపై గణనీయమైన మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్ఓ 3.0 ప్రతిపాదన డిజిటల్ చెల్లింపులు, ఈజ్-ఆఫ్-యాక్సెస్ ఫీచర్లను ఏకీకృతం చేయాలని నిర్ణయించింది. ఆధునిక బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలకు అనుగుణంగా ఇందులో మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి ఆమోదం పొందితే చందాదారులకు సర్వీసులు సులభతరం అవుతాయి.

  • ప్రావిడెంట్ ఫండ్‌లో కొంత భాగాన్ని ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.

  • ఎంపిక చేసిన లావాదేవీల కోసం వారి ఈపీఎఫ్‌ ఖాతాల నుంచి నేరుగా చెల్లింపులు చేయడానికి యూపీఐను ఉపయోగించవచ్చు.

పెన్షన్ పెంపు

ప్రస్తుతం రూ.1,000గా నిర్దేశించిన కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.1500 నుంచి రూ.2,500 వరకు పెంచే ప్రతిపాదన కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఈమేరకు నిర్ణయాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడిగా లారీ ఎల్లిసన్‌

#

Tags : 1

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)