Breaking News

ఇక కెమెరాలు, ప్రింటర్లు..  మరిన్ని కీలక ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆంక్షలు!

Published on Fri, 08/11/2023 - 17:14

పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల దిగుమతులకు లైసెన్స్ తప్పనిసరి చేసిన భారత ప్రభుత్వం ఇప్పుడు ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై కూడా అలాంటి ఆంక్షలు విధించే ఆలోచనలో ఉంది. ఈ ఉత్పత్తులలో కెమెరాలు, ప్రింటర్లు, హార్డ్ డిస్క్‌లు, టెలిఫోనిక్, టెలిగ్రాఫిక్ పరికరాల భాగాలు ఉండవచ్చని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

ఆ నివేదిక  ప్రకారం, స్థానిక మార్కెట్‌లో ఈ ఉత్పత్తులకు అత్యధిక డిమాండ్  ఉండటంతో విదేశాల నుంచి పెద్డఎత్తున​ దిగుమతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఉత్పత్తి అవకాశాలను ప్రోత్సహించాలంటే ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని దీనిపై అవగాహన ఉన్న వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వస్తువుల దిగుమతులు 2023 ఆర్థిక సంవత్సరంలో 10.08 బిలియన్‌ డాలర్లను అధిగమించాయి.

ఇతర వస్తువులపైనా సమీక్ష!
పైన పేర్కొన్న ఉత్పత్తులతో పాటు, అధిక దిగుమతి అవుతున్న ఇతర వస్తువులను ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు సమాచారం. వీటిలో యూరియా, యాంటీబయాటిక్స్, టర్బో-జెట్‌లు, లిథియం-అయాన్ అక్యుమ్యులేటర్‌లు, శుద్ధి చేసిన రాగి, యంత్రాలు, యాంత్రిక ఉపకరణాలు, సోలార్‌, ఫొటోవోల్టాయిక్‌ సెల్స్‌, అల్యూమినియం స్క్రాప్, పొద్దుతిరుగుడు విత్తన నూనె, జీడిపప్పు  ఉన్నాయి.

2023 ఆర్థిక సంవత్సరంలో, భారత్‌ మొత్తం సరుకుల దిగుమతులు 16.5 శాతం పెరిగి 714 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఈ దిగుమతులు పెరగడం వల్ల దేశం కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 2 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 1.2 శాతంగా ఉండేది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్-1 (ITA-1) పరిధిలోకి వచ్చే 250 ఉత్పత్తుల దిగుమతులపై ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఐటీఏ-1 జాబితాలో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు, కంప్యూటర్‌లు, టెలికాం పరికరాలు, సెమీకండక్టర్‌లు, సెమీకండక్టర్ తయారీ, యాంప్లిఫైయర్‌లు, టెస్టింగ్ పరికరాలు, సాఫ్ట్‌వేర్, సైంటిఫిక్‌ ఇన్‌స్ట్రుమెంట్లు సహా అనేక రకాల హై-టెక్నాలజీ వస్తువులు ఉన్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)