Breaking News

ఇల్లు కొనడానికి ఇదే సరైన కాలం..

Published on Sat, 06/14/2025 - 18:19

వర్షంలో బయటకు వెళ్లాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తడిసిపోతామనో లేక బురదగా ఉంటుందనో కారణాలెన్నో! కానీ, గృహ అన్వేషణ కోసం ఇదే సరైన సమయం అంటున్నారు రియల్టీ నిపుణులు. వానల్లోనే ఇంటి నిర్మాణ నాణ్యత, ప్రాంతం పరిస్థితి క్షణ్ణంగా తెలుస్తుంది కాబట్టి.. సొంతింటి ఎంపికకు ఇదే సరైన కాలమని సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో  

గృహ కొనుగోలుదారులు అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ప్రాజెక్ట్‌ ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలంటే వర్షంలో ప్రాజెక్ట్‌ను పరిశీలించాలి. నగరం ఏదైనా సరే వానొస్తే చాలు రహదారులన్నీ ట్రాఫిక్‌ జామ్‌ అవుతాయి. వర్షం నీరు వెళ్లే సౌకర్యం లేక రోడ్లన్నీ మునిగిపోతాయి. ఇది ఇల్లు ఉన్న ప్రాంతానికి సంబందించి వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది. ప్రాజెక్ట్‌ ఉన్న ప్రాంతంలో ప్రజారవాణా వ్యవస్థ ఎలా ఉంది? ఇంటి నుంచి బస్‌ స్టాండ్‌ లేక రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది వంటి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి.

నాణ్యత తెలుస్తుంది.. 
ప్రాజెక్ట్‌ ఉన్న ప్రాంతంతో పాటూ ఇంటి నిర్మాణ నాణ్యత బయటపడేది కూడా వానాకాలంలోనే.. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌లో కొనుగోలు చేసే కొనుగోలు
దారుల మాత్రం వానాకాలంలో ఇంటి నాణ్యత చెక్‌ చేసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఒక్కసారి గృహ ప్రవేశం అయ్యాక కామన్‌గా ఏర్పాటు చేసిన వసతుల్లో లీకేజ్‌లను పునరుద్ధరించడం కొంత కష్టం. వర్షా కాలంలో ప్రాజెక్ట్‌ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంట్లోని వాష్‌రూమ్, సీలింగ్, పంబ్లింగ్, డ్రైనేజీ లీకేజ్‌ వంటివి తెలుస్తాయి. ఆయా లోపాలను పునరుద్ధరించమని డెవలపర్‌ను కోరే వీలుంటుంది.

👉 ఇల్లు అమ్ముతున్నారా?.. ఇలా ఉంటే మంచి రేటు..

రీసేల్‌ ప్రాపర్టీలనూ.. 
రీసేల్‌ ప్రాపర్టీలను కొనేవారైతే వర్షాకాలంలో ఆయా ప్రాపర్టీలను స్వయంగా పరిశీలించడం ఉత్తమం. ఎందుకంటే వానల్లోనే ప్రాపర్టీ నిర్వహణ ఎలా ఉందో అవగతమవుతుంది. గోడల ధ్రుడత్వం, డ్రైనేజీ, పంబ్లింగ్‌ లీకేజీలు వంటివి తెలుసుకునే వీలుంటుంది. ప్రాపర్టీ లోతట్టు ప్రాంతంలో ఉందా? వరదలు ఎక్కువగా వచ్చే అవకాశముందా? అనేది తెలుస్తుంది. వరద నీరు భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు ఉన్నాయా? లేక అపార్ట్‌ మెంట్‌ సెల్లార్‌ నీటిలో మునిగిపోతుందా? అనేది తెలుస్తుంది.

వర్షంలో రాయితీలు..  
వర్షాకాలంలో గృహ కొనుగోళ్లు అంతగా జరగవు. కాబట్టి ఇలాంటి సమయంలో నిజమైన గృహ కస్టమర్లు వచ్చినప్పుడు వారిని డెవలపర్లు స్వాగతిస్తారు. ధర విషయంలో బేరసారాలు ఆడే వీలుంటుంది. రాయితీలు, ఇతర ప్రత్యేక వసతుల విషయంలో డెవలపర్లతో చర్చించవచ్చు. పైగా సెప్టెంబర్‌–అక్టోబర్‌ పండగ సీజన్‌ కావటంతో భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక రాయితీలతో అమ్మకాలను ప్రకటిస్తుంటారు డెవలపర్లు. 

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)