Breaking News

ఆదిపురుష్‌ ప్రమోషన్స్‌: స్పెషల్‌ శాలువాతో కృతి సనన్‌, దీని విశేషాలు తెలిస్తే 

Published on Wed, 06/14/2023 - 15:18

మోస్ట్‌  ఎవైటెడ్‌ , అప్‌  కమింగ్‌ మూవీ ఆదిపురుష్ ప్రమోషన్స్‌లో హీరోయిన్‌ కృతి సనన్ మరోసారి తన లేటెస్ట్‌ లుక్స్‌తో అందర్నీ కట్టిపడేస్తోంది. బ్యూటిఫుల్‌ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను  మెస్మరైజ్‌ చేసింది.  ముఖ్యంగా  ఈ ప్రచార కార్యక్రమంలో కృతి సనన్ అయోధ్య కథలతో రూపొందించిన శాలువను  ధరించడం విశేషంగా నిలిచింది.

కృతి సనన్  స్టైలిస్ట్, సుకృతి గ్రోవర్  ఇన్‌స్టా హ్యాండిల్‌లో దీనికి సంబంధించిన అద్బుత ఫోటోలను షేర్‌ చేసింది.  ఆదిపురుష్ ప్రమోషనల్ ఈవెంట్స్‌లోని  కృతి   లేటెస్ట్‌ లుక్స్‌తో  ఉన్న  పిక్స్‌ను పోస్ట్‌ చేసింది.  ముఖ్యంగా  వెడల్పాటి గోల్డెన్‌ అంచు, లేత గోధుమరంగు  అనార్కలిలో బ్యూటిఫుల్‌గా ఉంది. ప్రత్యేకంగా సుకృతి అండ్‌ ఆకృతి  బ్రాండ్  ప్రత్యేకంగా రూపొందించిన అయోధ్య కథల శాలువా ప్రత్యేక ఆకర్షణగా  నిలుస్తోంది.

రెండేళ్లు శ్రమించి  రామ కథలతో శాలువా
పురాణ గాథ రామాయణం ప్రేరణగా రూపొందించిన ఈ శాలువా తయారీకి  రెండు సంవత్సరాలు పట్టిందట. అంతేకాదు దీన్ని ఇంత అందంగా తీర్చి దిద్దడానికి  ఎన్ని వేల గంటలు  పట్టిందో తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు.  6000 కంటే ఎక్కువ గంటలే దీనికోసం కృషి చేశారు. రామాయణంలోని పంచవటి, స్వయంవరం, అశోక వనం, రామ్ దర్బార్‌లోని నాలుగు సన్నివేశాలు ఇందులో కూర్చారు.  పాషా, చోకర్స్, కడా లాంటి స్టేట్‌మెంట్ ఆభరణాలతో పాటు అందమైన హెయిర్ యాక్సెసరీతో అద్భుతమైన అనార్కలిలో దేవకన్యలా మెరిసిపోతోంది. (అపుడు పాల ప్యాకెట్‌ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!)

కాగా  ప్రభాస్‌, కృతి సనన్  జోడిగా రాబోతున్న చిత్రం  ఆదిపురుష్. జూన్ 16, 2023న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో టీం  బిజీగా  ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్‌  'రాఘవ'  కేరెక్టర్‌లోనే,  'జానకి' పాత్రలో  కృతి నటించిన సంగతి తెలిసిందే.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)