Breaking News

అదానీ టోటల్‌ గ్యాస్‌కు ఆడిటర్‌ రాజీనామా.. కానీ..!

Published on Fri, 05/05/2023 - 08:53

న్యూఢిల్లీ: అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ ఆడిటర్‌ సేవల నుంచి ‘షా దందారియా’ అనూహ్యంగా తప్పుకుంది. ఇతర బాధ్యతల కారణంగా స్టాట్యుటరీ ఆడిటర్‌ బాధ్యతలకు షా దందారియా అండ్‌ కో రాజీనామా సమర్పించినట్టు అదానీ టోటల్‌ గ్యాస్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. అదానీ గ్రూపుపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ సంచలన ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది జనవరి 24న నివేదిక విడుదల చేయగా, అందులో షా దందారియా పేరు కూడా ఉండడం గమనార్హం. అదానీ గ్రూపులో పెద్ద కంపెనీల ఖాతాలను, పెద్దగా అనుభవం లేని ఓ చిన్న ఆడిటింగ్‌ సంస్థ సేవలు అందించడాన్ని హిండెన్‌బర్గ్‌ సంస్థ ప్రశ్నించింది. 

హిండెన్‌ బర్గ్‌ చేసిన ఆరోపణలపై సెబీ దర్యాప్తు చేస్తుండడం తెలిసిందే. ఈ తరుణంలో అదానీ గ్రూపు కంపెనీకి ఆడిటర్‌గా షా దందారియా తప్పుకోవడం యాధృచ్చికం. అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న చిన్న చార్టర్డ్‌ అకౌంటెన్సీ సంస్థయే షా దందారియా. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు సైతం ఈ సంస్థ ఆడిటింగ్‌ సేవలు అందిస్తోంది. అయితే, ఒక్క అదానీ టోటల్‌ గ్యాస్‌ ఆడిటింగ్‌ సేవలకే ప్రస్తుతం రాజీనామా సమర్పించింది. ముందుగా ఒప్పుకున్న ఇతర బాధ్యతలు మినహా, తమ రాజీనామాకు మరే ఇతర కారణం లేదని షా దందారియా స్పష్టం చేసింది. 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)