Breaking News

దలాల్‌ స్ట్రీట్‌లో అదానీ మెరుపులు: రూ. 11 లక్షల కోట్లకు ఎంక్యాప్‌ 

Published on Fri, 08/18/2023 - 16:23

అదానీ గ్రూప్ అధినేత, బిలియనీర్ గౌతం అదానీకి భారీ ఊరట లభించింది. ఈ ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తరువాత మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను భారీగా కోల్పోయిన అదానీ గ్రూపు  క్రమంగా కోలుకుంటోంది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో  గౌతమ్ అదానీ నేతృత్వంలోని సమ్మేళనానికి చెందిన లిస్టెడ్ సంస్థలు 12 శాతం ర్యాలీ  అయ్యాయి.తాజాగా లాభాలతోసంస్థ ఎం క్యాప్‌ ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది.

అదానీ మార్కెట్‌ క్యాప్‌ రూ.11 లక్షల  కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసింది. ఈ  ఫిబ్రవరి తర్వాత మొదటిసారిగా గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను రూ.11 లక్షల కోట్ల మార్కును అధిగమించడం విశేషం. మొత్తం పది అదానీ గ్రూప్ కంపెనీలు - అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్, అదానీ పవర్, ఎసిసి, అంబుజా, ఎన్‌డిటివి శుక్రవారం ట్రేడ్‌లో భారీ పెరుగుదలను నమోదు చేశాయి. 

మరోవైపు అబుదాబి నేషనల్ ఎనర్జీ PJSC (TAQA)  అదానీలో పెట్టుబడులపై మీడియా నివేదికల మధ్య అదానీ గ్రూప్ స్టాక్‌లు దలాల్ స్ట్రీట్స్‌లో  మెరుపులు మెరిపించాయి. అదాని గ్రూప కంపెనీలో పెట్టుబడుల వార్తలపై అబుదాబి కంపెనీ స్పందించింది. ఆ వార్తల్లోవాస్తవం లేదని   TAQA  కొట్టిపారేసింది.ఈ వారం ప్రారంభంలో, యూఎస్‌ ఆధారిత బోటిక్ పెట్టుబడి సంస్థ  రాజీవ్ జైన్ నేతృత్వంలోని GQG భాగస్వామి అదానీ పవర్  31.2 కోట్ల ఈక్విటీ షేర్లను రూ. 9,000 కోట్లకు (1.1 బిలియన్ డాలర్ల) కొనుగోలు చేసింది.

కాగా ఈ ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు విడుదలైనప్పటి నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ రెండు నెలల్లోపే సమ్మేళనం స్టాక్‌లు 75 శాతానికి పడి పోయాయి. అదానీ గ్రూప్ అవకతవకలు, అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. ఈ ఆరోపణలు సత్యదూరమైనవని గౌతం అదానీ తీవ్రంగా ఖండించారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన మార్కెట్‌రెగ్యులేటరీ సెబీరిపోర్ట్‌ను త్వరలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంచ నుంది. 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)