Breaking News

హిండెన్‌ బర్గ్‌ వివాదం నుంచి తేరుకుని.. అదానీ మరో కీలక నిర్ణయం!

Published on Fri, 01/26/2024 - 18:09

హిండెన్ బర్గ్ వివాదం నుంచి కోలుకున్న ప్రముఖ డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే  పనిలో పడ్డారు.
 
ఇందులో భాగంగా గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ప్రస్తుతం తన టాప్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం తన బిజినెస్ జెట్‌ ఫ్లైట్లను రెట్టింపు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి రవాణా సౌకర్యం కోసం ఆరు పిలాటస్ పీసీ-24 విమానాలకు ఆర్డర్ ఇచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

12కి చేరిన బిజినెస్‌ జెట్లు 
ఈ ఆరు పిలాటస్ పీసీ-24 జెట్లను కొనుగోలు చేసిన తర్వాత అదానీ గ్రూప్ మొత్తం బిజినెస్ జెట్ల సంఖ్య 12 అవుతుంది. అదానీతో పాటు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వ్యాపార కార్యకలాపాల కోసం చేసే  జర్నీ సజావుగా, సమర్థంగా జరిగేలా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రీసేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసినందున మొత్తం ఆరు విమానాలకు రూ.300 కోట్లకు పైగా ఖర్చవుతుందని సమాచారం.  

సుప్రీం తీర్పుతో కోలుకున్న అదానీ 
2023లో జరిగిన నష్టాల నుంచి కోలుకున్న అదానీ గ్రూప్ ప్రస్తుతం తన వ్యాపారాన్ని విస్తరిస్తూ కార్యకలాపాలను పునరుద్ధరిస్తోంది. ఈ నెల ప్రారంభంలో సుప్రీం కోర్టు తన కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు.

80 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరి 
2023 జనవరిలో అమెరికా ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్ సంస్థ హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్ గౌతమ్ అదానీ, అతని సంస్థ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు ఆరోపించింది. ఈ ఆరోపణల కారణంగా అదానీ తన గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోవడంతో సుమారు 80 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు.



అత్యంత ధనవంతుడిగా
అయితే, ఏడాది తర్వాత సుప్రీంకోర్టు హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపై అదనపు దర్యాప్తు అవసరం లేదని, వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది.దీంతో అదానీ కంపెనీ నష్టాల నుంచి త్వరగా కోలుకొని, తన సంపదను తిరిగి పొంది ముకేశ్ అంబానీని అధిగమించి స్వల్పకాలం పాటు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)