Breaking News

యూఏఈకి ఉచిత వీసాలు.. అబుదాబి కంపెనీ ఆఫర్‌

Published on Sat, 10/04/2025 - 13:28

మోర్తాడ్‌(బాల్కొండ): గల్ఫ్‌లో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు అబుదాబిలోని ఏడీఎన్‌హెచ్‌ కంపెనీ (Abu Dhabi company) తెలంగాణలోని జీటీఎం సంస్థ ద్వారా ఉచితంగా వీసాలను (free visa) జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పలుమార్లు అనేకమందికి ఉచితంగా వీసాలు ఇచ్చిన ఈ సంస్థ..మరోసారి ఉచిత వీసాల జారీ కి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) లోని అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఏడీఎన్‌హెచ్‌ కంపెనీ క్లీనింగ్, క్యాటరింగ్‌ రంగాల్లో యువతకు ఉపాధి కల్పిస్తోంది. ఈనెల 10న జగిత్యాలలో, 11న నిజామాబాద్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈసీఎన్‌ఆర్‌ పాస్‌పోర్టు కలిగి ఉన్న యువకులకు అర్హత వయస్సు 21 నుంచి 38 ఏళ్ల వరకూ ఉండొచ్చని జీటీఎం సంస్థ చైర్మన్‌ చీటి సతీష్‌రావు ‘సాక్షి’తో చెప్పారు.

బేసిక్‌ ఇంగ్లిష్‌ వచ్చి ఉండాలని, పచ్చబొట్టు కనబడకుండా ఉండాలని తెలిపారు. ఒరిజినల్‌ పాస్‌పోర్టుతో జగిత్యాల లేదా నిజామాబాద్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు. ఎంపికైన వారికి రూ. 23 వేల వరకూ వేతనం, ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్టు వెల్లడించారు. ఎవరికీ నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం కోసం అభ్యర్థులు జీటీఎం సంస్థ నిజామాబాద్‌ (8686860999), ఆర్మూర్‌ (8332062299), జగిత్యాల (8332042299), సిరిసిల్ల (9347661522) నంబర్లలో సంప్రదించాలని సతీష్‌రావు సూచించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)