Breaking News

15 రోజులు.. 91 టెక్‌ కంపెనీల్లో 24 వేల మంది ఉద్యోగుల తొలగింపు!

Published on Mon, 01/16/2023 - 19:04

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం భయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ భయాలు భారత్‌లో ఎక్కువగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికల్ని ఉటంకిస్తూ.. ఉద్యోగుల తొలగింపుల్ని ట్రాక్‌ చేసే సంస్థ లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ. తాజాగా ఈ ఏడాదిలో అంటే జనవరి 1 నుంచి జనవరి 16 వరకు 91 సంస్థలు సుమారు 25,151 మందిని తొలగించినట్లు తెలిపింది. ఆ సంస్థలో అమెజాన్‌,సేల్స్‌ఫోర్స్‌, కాయిన్‌బేస్‌ తో పాటు ఇతర కంపెనీలున్నాయి. 

క్రిప‍్టో ఎక్ఛేంజ్‌ క్రిప్టో.కామ్‌ గత వారంలో ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం మంది సిబ్బందిని తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఓలా (200 మంది ఉద్యోగులను తొలగించింది), వాయిస్ ఆటోమేటెడ్ స్టార్టప్ స్కిట్‌.ఏఐ వంటి కంపెనీలు జనవరిలో భారీ ఎత్తున ఉద్యోగుల్ని ఫైర్‌ చేశాయి.

లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ ప్రకారం..2022లో మెటా,ట్విటర్,ఒరాకిల్,ఎన్విడియా,స్నాప్,ఉబెర్,స్పాటిఫై,ఇంటెల్,సేల్స్‌ఫోర్స్‌ సంస్థలు 153,110 మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు జారీ చేశాయి.నవంబర్‌లో ఉద్యోగుల తొలగింపుల సంఖ్య తారాస్థాయికి  చేరుకున్నట్లు నివేదించింది. ఒక్క నెలలోనే 51,489 మంది టెక్కీలు ఉపాధి కోల్పోయారు. మరో టెక్ దిగ్గజం గూగుల్‌ ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగుల్ని తగ్గించేలా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఈ వరుస లేఆఫ్స్‌తో 2023 సైతం టెక్నాలజీ రంగంలో గడ‍్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ నెలాఖరులో టెక్ రంగ సంస్థలు త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయోనని జాబ్‌ మార్కెట్‌ నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు