Breaking News

ఆర్థిక సేవల్లో ఏఐ, జెనరేటివ్‌ ఏఐ కీలకం

Published on Tue, 09/17/2024 - 07:41

న్యూఢిల్లీ: దేశంలో 90 శాతం ఆర్థిక సంస్థలు కృత్రిమ మేథ (ఏఐ)కు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. జెనరేటివ్‌ ఏఐని ఆవిష్కరణలకు కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంగా పేర్కొంది. డేటా అనలైటిక్స్‌ సైతం కీలకంగా మారుతున్నట్టు 74 శాతం ఆర్థిక సంస్థలు పీడబ్ల్యూసీ ఇండియా సర్వేలో భాగంగా వెల్లడించాయి. నిర్ణయాలు తీసుకోవడంలో దీని సమగ్రమైన ప్రాధాన్యతను వెల్లడించాయి. ఈ సర్వేలో 31 బ్యాంక్‌లు, బీమా సంస్థలు, ఫిన్‌టెక్‌లో తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.

పరిశ్రమ అభిప్రాయాలు..  
» కస్టమర్లను సొంతం చేసుకోవడం, వారికి మెరుగైన అనుభవాన్ని ఇవ్వడం నూతన ఆవిష్కరణలకు కీలకమని 84 శాతం సంస్థలు తెలిపాయి. 
» ఉత్పత్తుల పంపిణీ అన్నది ఆవిష్కరణలకు కీలకమని 50 శాతం సంస్థలు పేర్కొన్నాయి. 
» రిస్క్‌ను పరిమితం చేయడం, మారుతున్న నియంత్రపరమైన నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం కీలకమైనవిగా 65 శాతం సంస్థలు చెప్పాయి. ఆవిష్కరణల విషయంలో నియంత్రణ పరమైన అవరోధాలను అధిగమించడం కీలకమని తెలిపాయి. 
» ప్రధానంగా అంతర్గత చర్యల ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని 45 శాతం ఆర్థిక సంస్థలు వెల్లడించాయి. ‘‘ఫిన్‌టెక్‌ పరిశ్రమ అభివృద్ధి చెందే క్రమంలో వృద్ధికి.. డిజిటల్‌ భద్రత, నియంత్రణపరమైన నిబంధనల అమలుకు మధ్య సమతూకం అవసరం. నిబంధనల అమలు భాగస్వామ్యాల ద్వారా మారుతున్న నియంత్రపరమైన మార్పులను అధిగమించొచ్చు’’అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్‌ మిహిర్‌ గాంధీ తెలిపారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)