Breaking News

5G సేవలు వచ్చేశాయ్‌.. మార్కెట్లో చీప్‌ అండ్‌ బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లు ఏవో తెలుసా!

Published on Sun, 10/02/2022 - 13:33

దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5జీ(5G) నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సేవలు ఉపయోగించాలంటే వినియోగదారుల ఫోన్‌ 5జీ టెక్నాలజీకి సపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ ఖరీదైన ఫోన్లలోనే కాకుండా మధ్యస్థాయి ఫోన్లలో కూడా ఒక సాధారణ ఫీచర్‌గా ఉంటోంది. ఒకవేళ మీ మొబైల్ నెట్ వర్క్ సెట్టింగ్స్ లో ఎక్కడా కూడా మీకు 5జీ అనేది కనిపించకపోతే, మీ ఫోన్ దీనికి సపోర్ట్ చేయదనే అర్థం.

అలాంటప్పుడు మాత్రం మీరు 5జీని సపోర్ట్ చేసే కొత్త ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో 5G స్మార్ట్‌ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022లో 5జీ స్మార్ట్‌ఫోన్లకు డిస్కౌంట్లు, ఆఫర్స్ ఇస్తూ చవకైన ధరలకే సేల్‌ నిర్వహిస్తోంది.

రెడ్‌మీ 11 ప్రైమ్‌ 5జీ (Redmi 11 Prime 5G)
Redmi 11 Prime 5G ..   4GB RAM + 64GB స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 13,999 గా ఉంది. దసరా సీజన్‌ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 లో ఇది తగ్గింపుతో రూ. 12,999 వస్తోంది. దీంతో పాటు అదనంగా, ఎక్స్‌చేంజ్‌ ఆఫర్ కింద రూ 12,150 కే లభిస్తోంది. ఈఎంఐ( EMI) ఆఫర్‌ కూడా ఉందండోయ్‌, నెలకు రూ.621తో ఈ ఫోన్‌ని మీరు సొంతం చేసుకోవచ్చు. Amazon Pay ఆధారంగా అదనపు డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. 

రియల్‌మి నార్జో 50 5జీ (Realme Narzo 50 5G) 
రియల్‌మి నుంచి వచ్చిన మరో 5జి స్మార్ట్ ఫోన్లలో రియల్ మి నార్జో 50 5Gనే చవకైన ఫోన్‌ అని చెప్పాలి. మార్కెట్లోకి ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 15,999 గా ఉంది. ఇదే ఫోన్ ప్రస్తుతం అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా రూ. 12,249 గా లభిస్తోంది. వీటితో మీ వద్ద పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈఎంఐ చెల్లింపులో ఫోన్ ని కొనుగోలు చేస్తే.. రూ 750 కే ఈ ఫోన్ లభిస్తుంది. 

ఐకూ z6 లైట్‌ 5G (iQoo Z6 Lite 5G)
iQoo Z6 Lite 5G బేస్ మోడల్ ధర రూ. 13,999గా ఉంది. స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ కూడా భారీగానే ఇస్తున్నారు. SBI క్రెడిట్, డెబిట్ కార్డ్‌ వినియోగదారులు రూ. ఫ్లాట్-రేట్‌పై అదనపు రూ.750 వరకు తగ్గింపు లభిస్తుంది. 

సాంసంగ్‌ గెలాక్సీ ఎం13 5G (Samsung Galaxy M13 5G)
Samsung Galaxy M13 5G ప్రస్తుతం అమెజాన్‌లో దీని ధర రూ.11,999. ప్రారంభంలో ఈ మోడల్ ధర రూ. 13,999గా ఉంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. SBI క్రెడిట్ కార్డ్‌ కస్టమర్లకి ప్రత్యేక డిస్కౌంట్లు లభించనుంది.

చదవండి: 5G Network FAQs In Telugu: 5జి వచ్చేస్తోంది.. మీ ఫోన్‌లో ఈ ఆప్షన్‌ ఉంటే సపోర్ట్ చేసినట్లే!

Videos

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

Photos

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)