Breaking News

గుడ్ న్యూస్.. ఆ రంగాల్లో 50వేల కొత్త ఉద్యోగాలు!

Published on Thu, 08/17/2023 - 14:52

Jobs In Festival Season: త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగాలు ఇప్పటికే క్రెడిట్-కార్డ్ అమ్మకాలు, పర్సనల్ ఫైనాన్స్ అండ్ రిటైల్ బీమాలలో పెరుగుదలను ఆశిస్తున్నాయి. దీంతో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని నివేదికలు చెబుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

50వేల ఉద్యోగాలు.. 
నివేదికల ప్రకారం, ఈ ఏడాది ద్వితీయార్థంలో దాదాపు 50వేల తాత్కాలిక ఉద్యోగాలు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. సంస్థలు కూడా కొత్త ఉద్యోగులను చేర్చుకోవడాయికి ఆసక్తి చూపుతున్నాయి. మునుపటి ఏడాదికంటే కూడా ఈ సారి ఈ రంగాల్లో ఉద్యోగాలు 15 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది.

క్రెడిట్ కార్డ్ లావాదేవీలు పెరగడం, పర్సనల్ ఫైనాన్స్ అప్లికేషన్లు పెరగటమే కాకుండా రాబోయే 5 లేదా 6 నెలల్లో డైనమిక్ జాబ్ మార్కెట్‌కు సిద్ధంగా ఉన్నామని టీమ్‌లీజ్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్-BFSI కృష్ణేందు ఛటర్జీ తెలిపారు.

ఇదీ చదవండి: అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు!

పండుగ సీజన్‌లో తాత్కాలిక ఉద్యోగుల డిమాండ్ అహ్మదాబాద్, పూణే, బెంగళూరు, కోల్‌కతా వంటి టైర్ 1 నగరాల్లో మాత్రమే కాకుండా టైర్ 2 అండ్ టైర్ 3 నగరాలైన కొచ్చి, వైజాగ్, మధురై.. లక్నో, చండీగఢ్, అమృత్‌సర్, భోపాల్, రాయ్‌పూర్‌లలో కూడా ఎక్కువగా ఉండనుంది.

ఇదీ చదవండి: ఇదో చెత్త కారు.. రూ. 4 కోట్ల మసెరటిపై గౌతమ్ సింఘానియా ట్వీట్

వేతనం వివరాలు.. 
నిజానికి ఈ టెంపరరీ ఉద్యోగుల ఆదాయం మునుపటి ఏడాదికంటే కూడా 7 నుంచి 10 శాతం పెరిగాయి. కావున ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగుళూరులో జీతాలు నెలకు రూ. 20,000 నుంచి రూ. 22,000 వరకు.. అదే సమయంలో చెన్నైలో రూ. 15వేల నుంచి రూ. 17వేల వరకు &  కలకత్తాలో రూ. 13వేల నుంచి రూ. 15వేల వరకు ఉండనున్నాయి. దీన్ని బట్టి చూస్తే జీతాలు కూడా ఓ రకంగా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)