Breaking News

రూ.5.91 లక్షల కోట్లు బాకీ.. కట్టాల్సినవారు మాయం!

Published on Sun, 03/30/2025 - 08:24

న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఆశ్చర్యపరిచే గణాంకాలను ప్రభుత్వం పార్లమెంట్‌కు అందించింది. ప్రత్యక్ష పన్నుల్లో 47,674 మంది పన్ను ఎగవేతదారుల జాడ తెలియడం లేదని.. వీరు చెల్లించాల్సిన బకాయిలు రూ.5.91 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపింది.

అదే పరోక్ష పన్నుల్లో 60,853 మంది ఎగవేతదారుల ఆచూకీ లభించడం లేదని.. వీరు రూ.43,525 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉందని వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఈ వివరాలు తెలియజేశారు. పన్ను వసూళ్లకు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తీసుకున్న చర్యలను సైతం వివరించారు.

వ్యక్తిగత లావాదేవీల సమాచారాన్ని అందుబాటులో ఉంచడం, 360 డిగ్రీల కోణంలో ప్రొఫైల్‌ను ఫీల్డ్‌ యూనిట్లకు పంపించి.. పన్ను చెల్లింపుదారులను గుర్తించి, పన్ను వసూలు చర్యలకు వీలు కల్పించినట్టు చెప్పారు. పరోక్ష పన్నుల కేంద్ర మండలి పన్ను ఎగవేతదారుల నుంచి వసూలుకు గాను బ్యాంక్‌ ఖాతాల స్తంభన వంటి చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)