Breaking News

‘కంపెనీలకు వ్యాపారమే ముఖ్యం’

Published on Tue, 02/10/2026 - 12:21

కార్పొరేట్ ప్రపంచంలో లాయల్టీ (నమ్మకంగా పని చేయడం) కంటే అడాప్టబిలిటీ (మార్పుకు అనుగుణంగా మారడం) ముఖ్యమని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చెబుతున్నారు. ఒకే సంస్థలో దాదాపు 15 ఏళ్ల పాటు సేవలందించి అనూహ్యంగా ఉద్యోగం కోల్పోయిన ఓ 40 ఏళ్ల భారతీయ టెక్కీ తన ఆవేదనను, తాను నేర్చుకున్న పాఠాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

‘దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు’ అనే శీర్షికతో రెడ్డిట్‌లో ఓ వ్యక్తి అప్‌లోడ్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. కొవిడ్-19 తర్వాత సదరు కంపెనీ నిధుల కోసం తీవ్రంగా ప్రయత్నించిందని, అయితే జులైలో నిధులు నిలిచిపోవడంతో పరిస్థితి తలకిందులైందని ఆయన పేర్కొన్నారు. అధికారికంగా లేఆఫ్ ప్రకటించే కంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయమని మేనేజ్‌మెంట్ డిమాండ్‌ చేయడంతో ఆయన కంపెనీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు.

‘నేను అక్కడ చాలా సౌకర్యవంతంగా ఉన్నాను. కొత్త సవాళ్లు ఉన్నాయి. చాలా సమర్థంగా పని చేసేవాడిని. అందుకే 15 ఏళ్లలో కేవలం బయట ఒకటి రెండు ఇంటర్వ్యూలు మాత్రమే ఇచ్చాను. కానీ ఇప్పుడు వాస్తవం అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. మళ్లీ ఉద్యోగ వేటలో భాగంగా 60-70 కంపెనీలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత మార్కెట్ పరిస్థితిని విశ్లేషిస్తూ తోటివారి కోసం ఆయన కొన్ని అంశాలు తెలియజేశారు.

  • కంపెనీకి వ్యాపారమే ముఖ్యం. మిమ్మల్ని ఎప్పుడైనా  రీప్లేస్‌ చేయవచ్చు.

  • ఒకే చోట ఎక్కువ కాలం ఉండకండి.

  • కంపెనీ భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆరా తీస్తూ ఉండండి.

  • కొత్త విషయాలు నేర్చుకోవడం ఆపకండి.

  • మీ మార్కెట్ విలువ తెలుసుకోవడానికి ఇంటర్వ్యూలకు హాజరవుతుండాలి.

  • మీ విజయాలను, ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకోండి.

  • ప్రతి 6-12 నెలలకు లింక్డ్‌ఇన్, సీవీ అప్‌డేట్ చేయండి.

  • పరిచయాలను పెంచుకోండి. అవి కష్టకాలంలో ఆదుకుంటాయి.

  • కంపెనీలు రెజెక్ట్‌ చేస్తున్నా పెద్ద రోల్స్ కోసం ప్రయత్నించండి.

  • ఇంటర్వ్యూ తర్వాత లోపాలను అడిగి తెలుసుకోండి.

  • మీ ఉద్యోగం మాత్రమే మీ గుర్తింపు కాదు.

నెటిజన్ల స్పందన

ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఒకే కంపెనీలో ఏళ్ల తరబడి ఉండటం వల్ల మీరు రీప్లేస్‌ కోసం ఉన్న పాత ఫర్నిచర్‌లా మారిపోతారని ఒక యూజర్ స్పందించారు. మరో యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. ‘నేను 11 ఏళ్లలో 11 ఉద్యోగాలు మారాను. ప్రతిసారీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటూనే ఉన్నాను. కంపెనీ కుటుంబంలా అనిపించవచ్చు కానీ, మన నిజమైన కుటుంబం ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉండటమే మనుగడకు మార్గం’ అని సలహా ఇచ్చారు.

ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్స్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)