ఐటీ హార్డ్‌వేర్‌ పీఎల్‌ఐకి 40 దరఖాస్తులు - లక్షల కోట్ల ప్రతిపాదనలు

Published on Fri, 09/01/2023 - 07:03

న్యూఢిల్లీ: ఐటీ హార్డ్‌వేర్‌ ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద రూ. 4.65 లక్షల కోట్ల విలువ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, సర్వర్లు మొదలైనవి తయారు చేసేందుకు 40 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. అవన్నీ ఎంపికైన పక్షంలో ప్రోత్సాహక మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించిన రూ. 17,000 కోట్లకు మించి రూ. 22,890 కోట్లకు పెంచాల్సి వస్తుందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. 

‘గడువు తేదీ ఆగస్టు 30 నాటికి 40 దరఖాస్తులు వచ్చాయి. రూ. 3.35 లక్షల కోట్ల తయారీ లక్ష్యాలకు మించి రూ. 4.65 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు చేశాయి‘ అని పేర్కొంది. 

డెల్, హెచ్‌పీ వంటి బడా ఐటీ హార్డ్‌వేర్‌ కంపెనీలు నేరుగా, హెచ్‌పీఈ, లెనొవొ, ఏసర్, అసూస్, థామ్సన్‌ వంటివి దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీ ప్లాంట్లు ఉన్న కంపెనీల ద్వారా దరఖాస్తు చేసుకున్నాయి. మిగతా వాటిల్లో యాపిల్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్,  ప్యాడ్‌జెట్‌ (డిక్సన్‌), వీవీడీఎన్, నెట్‌వెబ్, ఆప్టీమస్, సహస్ర, సోజో (లావా) మొదలైనవి ఉన్నాయి.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)