Breaking News

34 ఏళ్లకే రిటైర్‌ అవ్వొచ్చు!

Published on Fri, 07/18/2025 - 15:52

దేశం వదిలి వెళ్లినవారు ఎంతో కొంత సంపాదించి కొంత ఆర్థిక స్వాతంత్ర్యం పొందిన తర్వాత తిరిగి స్వదేశానికి రావాలనుకుంటారు. 34 ఏళ్ల ఎన్ఆర్ఐ రూ.4 కోట్లు సంపాదించి భారత్‌కు తిరిగి వచ్చి త్వరగా రిటైర్ అవ్వాలని యోచిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. తన వద్ద రూ.4 కోట్లు ఉన్నాయని చెప్పారు. అందులో రూ.రెండు కోట్లు బ్యాంకు ఖాతాలో ఉందని, మరో రూ.రెండు కోట్లను రిటైర్మెంట్ కోసం పొదుపు చేయబోతున్నట్లు తెలిపారు. అయితే సోషల్‌మీడియా వేదికగా తనకు ఎవరైనా ఆర్థిక సలహా ఇవ్వమని కోరాడు. దాంతో ఆ పోస్ట్‌ కాస్తా వైరల్‌గా మారింది.

పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. ‘నేను ఇండియా వచ్చి రిటైర్ అయినా పార్ట్‌టైమ్‌గా పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాను. నా భార్యకు నేను రిటైర్ అవ్వడం ఇష్టం లేదు. పీహెచ్‌డీ పూర్తికావడంతో భారత్‌లో నాకు మంచి ఉద్యోగమే వస్తుందని నమ్ముతున్నాను. నా పొదుపులో నుంచి ఒక ఇంటిని అద్దెకు తీసుకుంటే మొత్తం ఖర్చులు కలిపి నెలకు సుమారు రూ.1లక్ష-రూ.1.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. నా వద్ద ఉన్న నిధులు సరిపోతాయా? అనే అనుమానం ఉంది. ఈ ఖర్చులను పరిగణించి దయచేసి రిటైర్మెంట్‌ ప్రణాళికలు సూచించండి’ అని కోరాడు.

ఇదీ చదవండి: 'సుకన్య సమృద్ధి' లాభదాయకమేనా?

‘మీరు త్వరగా పదవీ విరమణ చేసి భారతదేశానికి తిరిగి రావాలనుకుంటే అగ్రెసివ్‌ పెట్టుబడులు చేయవద్దు. నిధులు సరిపోతాయనే దిగులు వద్దు. అయితే మీ బడ్జెట్ విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాలి. సుమారు 5-6% వడ్డీ సమకూరే ఎఫ్‌డీలో రూ.1 కోటి ఉంచండి. మీ బడ్జెట్ అంచనా నెలకు రూ.1లక్ష-రూ.1.5 లక్షలుగా ఉంది. లోయర్ టైర్ సిటీలో ఇంటి అద్దెలు తక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్నేళ్ల పాటు అక్కడ ఉండండి. మరో రూ.3 కోట్లను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలోకి మళ్లించేలా బ్యాలెన్స్‌డ్‌ స్టాక్ మార్కెట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టండి. కనీసం 5-6 సంవత్సరాల వరకు దీన్ని విత్‌డ్రా చేయకూడదు. దాంతో ఇది బాగా పెరుగుతుంది. మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కోగలదు. దాంతో నెలకు కనీసం రూ.లక్ష సమకూరుతుంది. దాంతోపాటు మీరు పెట్టిన కార్పస్‌పై ప్రభావం ఉండదు’ అని ఒక యూజర్‌ తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)