Breaking News

5జీ ఫోన్లపై ఆసక్తికర సర్వే.. ఎంత మంది అప్‌గ్రేడ్‌ అయ్యారు?

Published on Wed, 10/04/2023 - 08:39

న్యూఢిల్లీ: దేశీయంగా అల్ట్రా హై–స్పీడ్‌ టెలికం సర్వీసుల వినియోగం వేగవంతమవుతున్న నేపథ్యంలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి నుంచి డిసెంబర్‌ ఆఖరులోగా 3.1 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు 5జీ ఫోన్లకు అప్‌గ్రేడ్‌ కానున్నారు. ప్రస్తుతం 5జీ హ్యాండ్‌సెట్‌ యూజర్ల సంఖ్య 8 నుంచి 10 కోట్ల మధ్యలో ఉంది. స్వీడన్‌కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌ రూపొందించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

వినూత్నమైన, వైవిధ్యమైన 5జీ కనెక్టివిటీ సేవల కోసం కాస్త ఎక్కువ చెల్లించేందుకు కూడా కస్టమర్లు సిద్ధంగానే ఉన్నట్లు నివేదిక తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అక్టోబర్‌లో దేశీయంగా 5జీ సేవలను ఆవిష్కరించారు. టెలికం సంస్థలైన రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌ గత కొద్ది నెలలుగా వీటిని విస్తృతంగా అందుబాటులోకి తెచ్చాయి. ఇటీవలి ఊక్లా నివేదిక ప్రకారం 5జీ సేవల ఆవిష్కరణతో భారత్‌లో మొబైల్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ గణనీయంగా పెరిగింది. స్పీడ్‌టెస్ట్‌ గ్లోబల్‌ ఇండెక్స్‌లో జపాన్, బ్రిటన్, బ్రెజిల్‌ను కూడా దాటేసి, 72 స్థానాలు ఎగబాకి భారత్‌ 47వ ర్యాంకుకు చేరుకుంది. 5జీని ప్రవేశపెట్టాక భారత్‌లో స్పీడ్‌ 3.59 రెట్లు పెరిగింది.  

సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలు.. 

  • మనకన్నా ముందు నుంచే 5జీ సేవలను వినియోగిస్తున్న అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, చైనాతో పోలిస్తే భారత్‌లో యూజర్లు సగటున వారానికి రెండు గంటలు ఎక్కువ సమయాన్ని 5జీ సర్వీసులపై వెచ్చిస్తున్నారు. 
  • 5జీని ముందుగా అందుబాటులోకి తెచ్చిన మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో 5జీపై సంతృప్తి స్థాయి అధికంగా ఉంది. 15 శాతం మంది వినియోగదారులు తమ 5జీ ప్లాన్లకు వీడియో ఆన్‌ డిమాండ్, గేమింగ్, మ్యూజిక్‌ వంటి అప్లికేషన్స్‌ను జోడించుకునేందుకు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ సర్వీసుల కోసం 14 శాతం ప్రీమియం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. 
  • నెలాఖరు వచ్చేసరికి 31 శాతం మంది 5జీ యూజర్లే తమ ప్లాన్లలో లభించే డేటాను పూర్తిగా వినియోగిస్తున్నారు. 58 శాతం మంది యూజర్ల ఖాతాల్లో 30 జీబీ పైగా డేటా మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రాధాన్యతలు, వినియోగ ధోరణులకు అనుగుణంగా డేటా వ్యూహాలను టెల్కోలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)