Breaking News

2030 నాటికి ఈ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగులు: నితిన్ గడ్కరీ

Published on Tue, 12/17/2024 - 20:40

2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దేశ ఆర్థిక వ్యవస్థ పెంపుకు కావాల్సిన కీలక నిర్ణయాలు, ఆటోమొబైల్ రంగం అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. దేశం అభివృద్ధి చెందాలంటే ఉపాధి కూడా తప్పనిసరి. కాబట్టి యువతకు ఉద్యోగాలు చాలా అవసరం. ఉద్యోగ కల్పనకు ఫుడ్ డెలివరీ సంస్థలు కీలకమని కేంద్రమంత్రి 'నితిన్ గడ్కరీ' అన్నారు.

జొమాటో నిర్వహించిన 'సస్టైనబిలిటీ అండ్ ఇన్‌క్లూజివిటీ - రోల్ ఆఫ్ ప్లాట్‌ఫామ్ ఎకానమీ' సమావేశంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతదేశంలో 77 లక్షల మంది డెలివరీ కార్మికులు ఉన్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 2.5 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.

దేశంలో ఏకంగా 2.5 కోట్ల మందికి ఉపాధి కల్పించడం చాలా పెద్ద విషయమే. ప్రస్తుతం దేశంలో ఉద్యోగ కల్పన చాలా అవసరం అని గడ్కరీ పేర్కొన్నారు. దేశంలోని చాలా మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నందుకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటోను.. మంత్రి అభినందించారు.

ఉద్యోగాల కల్పినలో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల సంఖ్యపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్‌లు పరిమిత సమయంలో వస్తువులను డెలివరీ చేయవలసి ఉన్నందున ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.

ఇదీ చదవండి: అంబానీ, అదానీ కంటే సంపన్నుడు: ఇప్పుడు నిలువ నీడ లేక..    

భారతదేశంలో గంటకు 45 ప్రమాదాలు, 20 మరణాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలిపారు. ఇందులో 18 నుంచి 45 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ద్విచక్ర వాహనదారుల సంఖ్య 80,000 కాగా.. ఇందులో హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణించినవారి సంఖ్య 55,000 కావడం గమనార్హం. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల 10,000 మరణాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. సరైన శిక్షణ అందించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని.. జొమాటో సుమారు 50వేలమంది డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నందుకు అభినందనలు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)