Breaking News

వంద కోట్ల సామ్రాజ్యం.. ఆటోలో ప్రయాణం

Published on Mon, 04/20/2026 - 14:13

నేటి గ్లామర్ లోకంలో కొంచెం డబ్బు రాగానే విలాసవంతమైన కార్లు, ఖరీదైన బంగ్లాలు, బ్రాండెడ్ వస్తువుల వెంట పడటం సహజం. కానీ, సుమారు రూ.100 కోట్ల నికర విలువ కలిగి ఉండి కూడా సామాన్యుడిలా ఆటోల్లో ప్రయాణిస్తూ బడ్జెట్ హోటళ్లలో బస చేసే ఒక పారిశ్రామికవేత్త కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రముఖ నూడిల్ బ్రాండ్ ‘నేచురల్లీ యువర్స్’ వ్యవస్థాపకుడు వినోద్ చెంధిల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌ (గతంలో ట్విట్టర్)లో పంచుకున్న ఒక సంఘటన ఈ చర్చకు దారితీసింది. తన స్నేహితుడైన ఒక ముంబై పారిశ్రామికవేత్త జీవనశైలి గురించి ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

‘నా స్నేహితుడి నికర ఆస్తి విలువ రూ.100 కోట్లకు పైమాటే. కానీ అతను ముంబైకి వచ్చినప్పుడల్లా ఆటోరిక్షాల్లోనే తిరుగుతాడు. వీలైతే షేర్ ఆటోలు, టాక్సీలను ఆశ్రయిస్తాడు. బస చేయడానికి సాధారణ హోటళ్లనే ఎంచుకుంటాడు. ఇప్పటికీ అతనికి ఎలాంటి లగ్జరీ కార్లు లేవు’ అని చెంధిల్ పేర్కొన్నారు.

చెంధిల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ పారిశ్రామికవేత్త ఉద్దేశపూర్వకంగానే విలాసాలకు దూరంగా ఉంటున్నారు. ఆర్థికంగా ఎంత ఎదిగినా తన మూలాలను మర్చిపోకుండా ఆచరణాత్మకమైన జీవనశైలినే ఇష్టపడుతున్నారు. సంపద పెరిగిన తర్వాత ఆయన జీవితంలో సెలవుల కోసం కేటాయించే సమయం, వ్యక్తిగత స్వేచ్ఛలో మాత్రమే మార్పులొచ్చాయి.

నెటిజన్ల రీయాక్షన్‌

ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘డబ్బు ఉన్నా గర్వం లేకపోవడం గొప్ప విషయం. భౌతిక సంపద కంటే మానసిక ప్రశాంతత, సమయం ముఖ్యం అని ఆయన నిరూపించారు’ అని కొందరు కొనియాడుతున్నారు. ‘సంపాదించిన డబ్బును సౌకర్యాల కోసం ఖర్చు చేయకపోతే ఆ సంపాదనకు అర్థం ఏముంది? కనీసం సమయాన్ని ఆదా చేసుకోవడానికైనా కారు వాడాలి కదా!’ అని మరికొందరు వాదిస్తున్నారు. దీనికి సమాధానంగా, తన స్నేహితుడు ఈ జీవనశైలితో చాలా సంతోషంగా ఉన్నారని చెంధిల్ స్పష్టం చేశారు.

మినిమలిజం.. స్టార్టప్ ప్రపంచంలో కొత్త ట్రెండ్?

ప్రస్తుతం స్టార్టప్ సర్కిల్స్‌లో మినిమలిజం లేదా కనీస అవసరాలతో జీవించడం అనే ధోరణి పెరుగుతోంది. కేవలం ఆడంబరాల కోసం ఖర్చు చేయకుండా ఆ సంపదను తిరిగి వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టడం లేదా అర్థవంతమైన అవసరాల కోసం (ప్రయాణాలు, కుటుంబంతో గడపడం) ఉపయోగించడంపై యువ వ్యవస్థాపకులు మొగ్గు చూపుతున్నారు.

ఇదీ చదవండి: డిమాండ్‌ భళా.. నిర్మాణాలు డీలా!

Videos

భారత నౌకలను పేల్చేస్తాం బయటపడ్డ రేడియో సంభాషణ క్లిప్...

Kasu Mahesh Reddy : జరా జాగ్రత్త..!

మీ మేనత్తలు అంటే మీ అమ్మకు రోత. లోకేష్ కు ఇచ్చిపడేసిన లక్ష్మీపార్వతి

అమెరికా యూనివర్సిటీలో బంగారు ఫలకంపై రోజా కూతురి పేరు

సొంత కార్యకర్తకే కడుపు మండి రోడ్డుపై మంచం వేసుకుని నిరసన

గుంటూరు జిల్లాలో దారుణం మైనర్‌పై అత్యాచారం

చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం

టార్చి లైట్ మినిస్టర్ ఎవరు..?

ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. మోడల్ షాకింగ్ రియాక్షన్

మంగ్లీ అనుచరుల నుంచి నాకు ప్రాణహాని

Photos

+5

అమీర్‌పేట్‌లో సందడి చేసిన హీరోయిన్ దక్ష నాగర్కర్ (ఫొటోలు)

+5

కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. కాజల్ ఫుల్ హ్యాపీస్ (ఫొటోలు)

+5

కశ్మీరీ అమ్మాయిలా ఐశ్వర్య రాజేశ్.. మనాలి ట్రిప్ (ఫొటోలు)

+5

కుందనపు బొమ్మలా దీప్షిక చంద్రన్ (ఫొటోలు)

+5

పట్టుచీరలో డస్కీ బ్యూటీ డింపుల్ (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర శబరిమల (అయ్యప్ప స్వామి దేవాలయం) ఎక్కడ ఉందో తెలుసా (ఫొటోలు)

+5

సింహాచలం అప్పన్న చందనోత్సవం..భారీగా భక్తులు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ‘కళా సెంటినియల్‌ సాగా’ చిత్రకళా ప్రదర్శన (ఫొటోలు)

+5

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 19-26)