Breaking News

‘యువత పోరు’తో చంద్రబాబు వైఖరిని ఎండగడదాం: వైవీ సుబ్బారెడ్డి

Published on Sat, 03/08/2025 - 11:28

గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. ఈ నెల 12వ తేదీన ‘‘యువత పోరు’’(Yuvatha Poru) పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. 

యువత పోరు పోస్టర్‌ను లాంఛ్‌ చేసిన రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) మీడియాతో మాట్లాడారు. యువతపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. వారికి ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయటం లేదు. అందుకే 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించాం. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని గట్టిగా డిమాండ్‌ చేస్తాం. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా  పోరాటం చేస్తాం. 

👉రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మూడు త్రైమాసికాల నుండి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను చంద్రబాబు వేధిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నిధులు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ  రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టబోతున్నాం. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్‌ల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నాం. ఎక్కడికక్కడే మెమోరాండం సమర్పించబోతున్నాం. ఫీజు బకాయిలతో పాటు నిరుద్యోగ సమస్య, మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన అంశాలపైనా యువత పోరు ఉండనుంది.

👉నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) మాట తప్పింది. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ యువతను మోసం చేశారు. ఉద్యోగాల్లేక యువత అల్లలాడిపోతోంది. 

కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం నాణ్యమైన వైద్యం అందించాలని జగన్ 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. ఐదు కాలేజీలను ఆల్రెడీ ప్రారంభించారు. కానీ, చంద్రబాబు ప్రయివేటు పరం చేయాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకుందాం.

విద్యార్థులు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ ర్యాలీలు నిర్వహిద్దాం. యువత పోరును పెద్ద ఎత్తున విజయవంతం చేద్దాం’’ అని వైఎస్సార్‌సీశ్రేణులను ఉద్దేశించి  వైవీ సుబ్బారెడ్డి పిలుపు ఇచ్చారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు