Breaking News

కూటమి ప్రభుత్వ పాలనపై వెల్లువెత్తిన నిరసన 

Published on Thu, 06/05/2025 - 09:03

సాక్షి, రాజమహేంద్రవరం:   కూటమి ప్రభుత్వ వెన్నుపోటుపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది.. ప్రభుత్వ మోసాలను ఎండగట్టింది.. భారీ స్థాయిలో రోడ్డుపైకి వచ్చింది.. ప్లకార్డులు, నిరసన ప్రదర్శనలతో కదం తొక్కింది. ఏడాది పాలనలో ఏం సాధించారు..? ఏం ఇచ్చారు..? అంటూ ప్రశ్నించింది.. ఏ వర్గం వారిలో సంతోషం లేదని ఆవేదన చెందింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు చేసిన నయ వంచనను ఎత్తి చూపుతూ భారీ ర్యాలీలు చేపట్టింది.. కూటమి అరాచకాలను ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజలకు చేసిన దగాపై వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్, నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల్లో బుధవారం నిరసన ప్రదర్శనలు, భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ అధికారులకు వినతి పత్రాలు సమరి్పంచారు.  

రాజమహేంద్రవరం సిటీ: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిందేమీ లేదని మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్‌ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు చేసిన మోసం, సాగిస్తున్న అరాచకాలకు నిరసనగా జాంపేట ఆజాద్‌ చౌక్, జెండాపంజా రోడ్, సూర్య హోటల్, సబ్‌ కలెక్టరేట్‌ ఆఫీస్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘బాబు ష్యూరిటీ మోసం, ఉచిత పంటల బీమాకు పంగనామాలు, నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తావ్‌ బాబూ’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ప్ల కార్డులు, నల్లబెలూనుŠల్‌ చేతబట్టి, నల్ల కండువాలు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు.  

పోలీసుల ఆంక్షలు  
నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌ సీపీ నేతలపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. బెలూన్లు, నల్ల కండువాలను లాక్కున్నారు. డీజేను సీజ్‌ చేశారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంతో పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్సార్‌ సీపీ నేతలను పోలీసులు లాక్కెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తొక్కిసలాట  చోటు చేసుకుంది. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే, పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఎక్కడి న్యాయమని మాజీ ఎంపీ భరత్‌ నిలదీశారు. పార్టీ శ్రేణులను లాక్కెళ్లడాన్ని అడ్డుకున్నారు. ర్యాలీ అనంతరం వైఎస్సార్‌ సీపీ జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డితో కలిసి ఆర్డీఓ కృష్ణానాయక్‌కు వినతి పత్రం సమరి్పంచారు.  

అనపర్తి
నియోజకవర్గ కేంద్రమైన అనపర్తిలో వైఎస్సార్‌ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ రైల్వే స్టేషన్‌ రోడ్‌ మెయిన్‌ రోడ్‌ మీదుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు నిర్వహించారు. పార్టీ జెండాలు, ప్లకార్డులతో ర్యాలీ సాగింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం సమరి్పంచారు.   

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)