Breaking News

‘ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు.. ఏపీ పోలీసుల పనితీరుకు నిదర్శనం’

Published on Sun, 09/28/2025 - 15:47

తాడేపల్లి : సవీంద్ర కేసులో పోలీసుల వ్యవహార శైలిపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం గొప్ప విషయమన్నారు వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి. పోలీసుల వైఖరిపై హైకోర్టు సుమోటోగా స్వీకరించి సీబీఐకి అప్పగించడం అనేది మంచి పరిణామన్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అయితే, పోలీసుల పని తీరుకు నిదర్శనమన్నారు. ఈరోజు(ఆదివారం, సెప్టెంబర్‌ 28వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. వెంటనే హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

‘రాష్ట్ర ప్రభుత్వం పౌరుల హక్కులను కాలరాస్తోంది. హైకోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసుల్లో మార్పు రాలేదు. బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చామని డాక్టర్ కాకర్ల సుబ్బారావే స్వయంగా చెప్పారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. జగన్ పర్యటనలను నియంత్రిస్తున్నారు. జగన్ సభలకు వచ్చే వారిని డ్రోన్ కెమెరాలతో గుర్తించి కేసులు పెడుతున్నారు. సాక్షి విలేరకర్లు, యాజమాన్యం మీద తప్పుడు కేసులు పెట్టారు. 

తప్పుడు కేసుల విషయంలో డీజీపీని కోర్టుకు పిలిపిస్తామని హెచ్చరించినా పోలీసుల్లో మార్పు రాలేదు. తప్పు చేస్తే కేసులు పెట్టాలిగానీ అరెస్టులు చేయటానికే కేసులు పెడుతున్నారు. పోసాని కృష్ణమురళి, తురకా కిషోర్ సహా అనేకమంది మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. ఆరేళ్ల క్రితం ఏదో జరిగిందని ఇప్పుడు కేసులు పెడుతున్నారు. సవీంద్ర కేసులో మఫ్టీలో వెళ్ళి అరెస్టు చేయటంపై హైకోర్టు సీరియస్ అయింది. హైకోర్టు ఉద్యోగి జడ్జీలకు ఫైళ్లను తీసుకెళ్తుంటే సీఐ శ్రీనివాస్ దాడి చేశాడు. 

 

జడ్జీల ఫైళ్లు ఉన్న వాహనాన్ని కూడా పీఎస్‌కి తరలించారు. ఏపీలో పోలీసుల పనితీరుకు ఇదే నిదర్శనం. టీడీపీ సోషల్ మీడియా వైఎస్సార్ సీపీ నేతల కుటుంబాలపై పెడుతున్న దారుణమైన పోస్టులు ప్రభుత్వానికి కనపడటం లేదా?, ఐ-టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలి. వ్యక్తిత్వ హననం చేస్తూ పెట్టిన పోస్టులపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?, జగన్ ఫోటో వాట్సప్ డీపీ పెట్టుకుంటే కేసులు పెడుతున్నారు. బైకుల మీద జగన్ బొమ్మ కనపడితే సీజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎల్లోమీడియా పైత్యం బాగా పెరిగింది. జగన్ రాష్ట్రం కోసం అప్పులు చేస్తే సోమాలియా, శ్రీలంక అవుతోందని రాశారు. అదే చంద్రబాబు అప్పులు చేస్తే రుణ సమీకరణ అంటూ ముద్దుగా రాస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

సవీంద్ర అక్రమ అరెస్ట్‌ కేసు సీబీఐకి అప్పగిస్తూ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Videos

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!