నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సందీప్ అక్రమ అరెస్ట్
Published on Mon, 07/06/2026 - 16:06
గుంటూరు: వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శృంగారపాటి సందీప్ అక్రమ అరెస్ట్ అయ్యారు. తాడేపల్లి నుంచి గుంటూరు వస్తుండగా టోల్గేట్ వద్ద శృంగారపాటి సందీప్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సందీప్‌ను కారు దింపి బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకుని వెళ్లిపోయారు పోలీసులు.
ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని పోలీసులను సందీప్ ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పకుండా బలవంతంగా తీసుకువెళ్లిపోయారు. 15 రోజుల నుంచి పోలీసులు సందీప్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కారణం చెప్పకుండా పోలీస్ స్టేషన్ రావాలని సందీప్‌ను తుళ్లూరు పోలీసులు వేధిస్తున్నారు. ఆయన ఇంట్లోలేని సమయంలో పోలీసులు ఇంటికి వెళ్లి అతడిని అరెస్ట్ చేస్తామని కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. సందీప్‌ను పోలీసులు ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags : 1