Breaking News

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోరుతూ వైఎస్సార్‌సీపీ ప్రత్యేక తీర్మానం

Published on Tue, 09/23/2025 - 16:24

విజయవాడ: ఏపీ శాసనమండలి సమావేశాల్లో భాగంగా  విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోరుతూ వైఎస్సార్‌సీపీ ప్రత్యేక తీర్మానం ప్రవేశ పెట్టింది.  విపక్షనేత బొత్స సత్యనారాయణ సభలో ఈ తీర్మానం పెట్టారు.  విశాఖలో స్టీల్‌ ప్లాంట్‌లో పెట్టుబడులు ఉప సంహరణ వెనక్కి తీసుకోవాలని, అదే సమయంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని కోరుతూ తీర్మానం పెట్టారు. దీనికి  అన్ని పక్షాల సభ్యులు మద్దతు ఇవ్వాలని బొత్స సత్యనారాయణ కోరారు. 

దీనిలో భాగంగా బొత్స ప్రసంగిస్తూ.. ‘స్టీల్ ప్లాంట్ అందరికీ సెంటిమెంట్‌తో కూడుకున్నది. ఇండస్ట్రీస్ మేం అభివృద్ధి చేశామని టీడీపీ చెప్తుంది. పారిశ్రామిక రంగం విచ్చిన్నమైంది.. మేమొచ్చి అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పారు. గత ఐదేళ్లలో జీడీపీ పెరిగింది తప్ప ఎక్కడా తగ్గలేదు. మా ప్రభుత్వ హయాంలో దేశంలో ఉన్న పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూశారు. విశాఖలో 2023లో జరిగిన సమ్మిట్‌కి ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామికవేత్తలు వచ్చారు..

ప్రభుత్వ విధానాలు నచ్చి నవీన్ జిందాల్ వంటి వారు  వచ్చారు.13 లక్షల కోట్ల రూపాయల ఎంవోయూలు చేసుకున్నాం. పరిశ్రమలు రావాలంటే వాళ్లకు నమ్మకం ఉండాలి. పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వానికి కో ఆర్డినేషన్ జరగటం నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే చూస్తాయి. గత మా సెకీ ఒప్పందాలపై నానా రాద్ధాంతం చేశారు. 

ఆ తర్వాత ఏమైంది. విశాఖను ఫార్మా హబ్‌లా తీర్చిదిద్దాం. మాట్లాడితే హైదరాబాద్‌లో హైటెక్ సిటీ కట్టాం అని చెప్పుకుంటారు.  గత ఐదేళ్లలో విశాఖలో ఐటీ కంపెనీలు సహా అనేక కంపెనీలు తెచ్చాం. ఇవాళ వాళ్ళు ప్రారంభోత్సవాలు చేస్తున్నారో అవన్నీ మా హయాంలో మేం శంకుస్థాపనలు చేసినవే. లులూ కంపెనీ ఐదు మాల్స్ మూతపడ్డాయి.. అసలు దాని వర్త్ ఎంత..దాని క్రెడిబిలిటీ ఏంటి?, విజయవాడ ఆర్టీసీ స్థలం వాళ్లకు ఇవ్వటం ఏంటి?, ఆక్షన్‌లో పెట్టకుండా నేరుగా ఎందుకు ఇచ్చి వేస్తున్నారు’ అని ప్రశ్నల వర్షం కురిపించారు బొత్స.

స్టీల్‌ప్లాంట్‌పై పై బట్టబయలైన టీడీపీ ద్వంద్వ నాటకం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంశంపై టీడీపీ ద్వంద్వ వైఖరి మండలి సాక్షిగా బట్టబయలైంది. వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన తీర్మానానికి మంత్రి నారా లోకేష్‌ మద్దతు ఇవ్వలేదు. స్టీల్‌ప్లాంట్‌ పెట్టుబడులు ఉప సంహరణ వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తీర్మానం ప్రవేశపెట్టగా, దానికి కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్సీల మద్దతు కోరారు బొత్స.  తాము ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌ పెట్టాలని బొత్స కోరారు. దీనికి కూటమి పార్టీలు మద్దతు ఇవ్వలేదు. 

ఇదీ చదవండి: 
మండలిలో మంత్రి లోకేష్‌ను ఏకిపారేసిన బొత్స

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)