Breaking News

‘చంద్రబాబు అధికారంలో ఉంటే భూముల దోపిడీకి ప్రాధాన్యత’

Published on Tue, 01/27/2026 - 17:48

విశాఖ: చంద్రబాబు బరితెగించి ప్రభుత్వ భూములను దోపీడీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు కుటుంబం భూముల దోపిడీ చేస్తోందని, చంద్రబాబు అధికారంలో ఉంటే భూముల దోపిడీకి ప్రాధాన్యత ఇస్తామరని ధ్వజమెత్తారు. ప్రధానంగా గీతం యూనివర్శిటీకి భూములు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఈరోజు( మంగళవారం. జనవరి 27వ తేదీ)జీవీఎంసీ కార్పొరేటర్లతో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ, కన్నా బాబు, గుడివాడ అమరనాథ్, కేకే రాజు, వాసుపల్లిలు సమావేశమయ్యారు. 

30వ తేదీన జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎంపీ భరత్ యూనివర్సిటీకి 55 ఎకరాలు కేటాయించాలని కూటమి ప్రభుత్వం ఎజెండా సిద్ధం చేయడాన్ని తప్పుబడుతున్నారు. రూ. 5 వేల కోట్ల విలువ చేసే భూ కేటాయింపులు రద్దు చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది. 

ఈ నెల 30వ తేదీన జరిగే భూ కేటాయింపులను అడ్డుకుంటామని ఇప్పటికే వైఎస్సార్‌సీపీ హెచ్చరించగా, ఆ మేరకు అనుసరించాల్సిన వ్యూహంపై  జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించారు. దీనిలో భాగంగా వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ..  ‘ ప్రభుత్వ భూములను కాపాడటం కోసం వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ వరకూ పోరాటం చేస్తోంది. ప్రభుత్వ భూములను విశాఖ ఎంపీ భరత్‌ కబ్జా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉంటే భూముల దోపిడీకి ప్రాధాన్యత ఇస్తారు. గీతం యూనివర్శిటీకి భూములు ఇవ్వడం దుర్మార్గమైన చర్య. గీతం యూనివర్శిటీకి ఇచ్చిన భూములపై మా పోరాటం ఆగదు’ అని హెచ్చరించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)