Breaking News

నేడు అనంతపురం, అరకులో సామాజిక బస్సు యాత్ర షెడ్యూల్‌

Published on Fri, 12/29/2023 - 08:42

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. నేడు అనంతపురం, అరకు నియోజకవర్గాలలో జరగనుంది. అనంతపురంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగునుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు అనంతపురం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వైఎస్సార్‌సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అంబేద్కర్ విగ్రహం నుంచి పాతవూరు గాంధీ విగ్రహం వరకు బస్సు యాత్ర సాగనుంది.  అనంతరం సాయంత్రం 4 గంటలకు చెన్నకేశవస్వామి ఆలయం ఎదురుగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ మంత్రి పేర్ని నాని, జూపూడి ప్రభాకర్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరుకానున్నారు.

అల్లూరి జిల్లా..
అల్లూరి జిల్లా అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గొన ఆధ్వర్యంలో హుకుంపేటలో బస్సుయాత్ర జరగనుంది. ఉదయం 11 గంటలకు బర్మన్ గూడలో వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం బర్మన్ గూడా నుంచి హుకుంపేట వరకు భారీ బైక్ ర్యాలీ సాగనుంది. అనంతరం హుకుంపేట కస్తూరిబా పాఠశాలలో నాడు- నేడు పనులను మంత్రులు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హుకుంపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు రాజన్న దొర, మేరుగు నాగార్జున, ఇంచార్జ్ మంత్రి గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, సీదిరి అప్పలరాజు తదితరులు హాజరుకానున్నారు.

ఇదీ చదవండి: అందుకేనట బాబు రహస్య మంతనాలు!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)