Breaking News

తాడి‘కొండంత’ సంబరం 

Published on Sun, 12/31/2023 - 05:31

సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రతో గుంటూరు జిల్లా తాడికొండలో శనివారం సంబరం నెలకొంది. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారీ్టలు భారీ ఎత్తున హాజరై జైకొట్టారు. బీసీలను సీఎం జగన్‌ బ్యాక్‌బోన్‌ కులా­లుగా మార్చారని నేతలు కొనియాడారు. సామా­జిక సాధికారతను ప్రభుత్వ విధానంగా అమలు చేశారని ప్రశంసించారు. బడుగు,  బలహీనవర్గాలకు రాజ్యాధికార పదవులు కట్టబెట్టి వారి ఉన్నతికి కృషి చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి వైఎస్సార్‌సీపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.  

సామాజిక న్యాయం అమలు చేసిన సీఎం జగన్‌ ఒక్కరే.. 
సామాజిక సాధికారతకు సీఎం వైఎస్‌ జగన్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్‌ కొనియాడారు. వైఎస్‌ కుటుంబం కోసం తన ఎమ్మెల్యే పదవిని సైతం త్యాగం చేసిన మేకతోటి సుచరితను తాడికొండలో గెలిపించాలని ప్రజలను కోరారు. భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఏకైక సీఎం జగన్‌ మాత్రమేనన్నారు.

దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? బీసీల తోకలు కట్‌ చేస్తానని చంద్రబాబు అవమానించారని గుర్తు చేశారు. మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ గతంలో సామాజిక న్యాయం అనేది నినాదంగా ఉండేదని.. దాన్ని ప్రభుత్వ విధా­నంగా మార్చివేసిన ఘనత జగనన్నకు దక్కిందన్నారు. బడుగులకు మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులుగా అవ­కాశం కలి్పంచారని కొనియాడారు. బీసీలు, ఎస్సీల్లో చిచ్చుపెడుతున్న చంద్రబాబు మాయలో పడొద్దని ప్రజలను కోరారు.  

దళిత మహిళకు హోం మంత్రి పదవిని ఇచ్చారు.. 
మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ దళిత మహిళగా హోం మంత్రి పదవిని ఊహించుకోలేదని,  దాన్ని నిజం చేసి చూపించిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. జగనన్న రాత్రికి రాత్రే తనను ఒక స్టార్‌ను చేశారన్నారు. రాష్ట్రంలో తొలి దళిత హోం మంత్రి ఎవరంటే తనపేరే ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. తాడి­కొండ మాజీ సమన్వయకర్త కత్తెర సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ భారతదేశంలో సమ సమానత్వం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తున్నామని తెలిపారు.

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలి.. పేదరి­కం ఉండకూడదనుకుంటే సీఎం వైఎస్‌ జగన్‌ను గెలిపించుకోవాలన్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ ప్రతి పేదవాడి సంక్షేమం కోసమే కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మంచి జరిగిందంటే అది ఆయ­న పుణ్యమేనన్నారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ తాడికొండను గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలని పిలు­పునిచ్చారు.

ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తోంది జగన్‌ మాత్రమేనన్నారు. 50 వేల మంది పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుపడ్డారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు కిలారు రోశయ్య, అన్నాబత్తుని శివకుమార్, నంబూరు శంకరరావు, తాడికొండ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహా్మనందరెడ్డి పాల్గొన్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)