Breaking News

డీఎస్సీ అక్రమాలపై ఉద్యమం ఉధృతం

Published on Tue, 08/04/2026 - 05:16

సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామ­కాల్లో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఉద్య­మాన్ని మరింత ఉధృతం చేసింది. డీఎస్సీలో అక్ర­మాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక­వర్గ కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్, టౌన్‌హాల్‌ సమావేశాలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జరిగిన ఈ సమావేశాల్లో పార్టీ నేతలు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులకు న్యాయం చేయాలని, ఇటువంటి దారుణాలు మరోసారి జరగకుండా చూడాలని నాయకులు డిమాండ్‌ చేశారు. 

పలువురు డీఎస్సీ బాధిత అభ్యర్థులు మాట్లాడుతూ నియామక ప్రక్రియలో అక్రమాలకు పాల్పడటం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆధారాలతో సహా వివరించారు. సీబీఐ విచారణ ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. అన్ని అర్హతలు ఉన్నా నష్టపోయిన బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటంకొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ నాయకులు పునరుద్ఘాటించారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లించాలని నాయకులు డిమాండ్‌ చేశారు.  
   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)