Breaking News

వెన్నుపోటుపై తిరుగుబాటు

Published on Sat, 06/13/2026 - 04:17

సాక్షి, అమరావతి, నెట్‌వర్క్‌:  సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీలను అమలు చేయకుండా చంద్రబాబు సర్కార్‌ దగా చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగ్రహ జ్వాల నింగికెగిసింది. చంద్రబాబు మోసాల పాలనపై ప్రజ­లతో కలసి ఎక్కడికక్కడ వైఎస్సార్‌ సీపీ క్యాడర్, నాయకులు తిరగబడ్డారు. నల్ల బెలూన్లు ఎగరవేశారు.. బైక్‌ ర్యాలీలు నిర్వహించారు.. కూటమి మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు పెడతామంటూ  అడుగడుగునా బారికేడ్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసుల ద్వారా సర్కా­రు బెదిరింపులకు దిగినా ప్రజలు ఖాతరు చేయలేదు. 

మా పేర్లు రాసుకోండి..! ఏమేం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి..! వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీల్లో పాల్గొని తీరుతామంటూ నియోజకవర్గాల కేంద్రాలకు శుక్రవారం జనం స్వచ్ఛందంగా, తండోపతండాలుగా తరలివచ్చారు. యువత, మహిళలు, రైతులు పోటెత్తారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వెన్నుపోటు పొడిచిన టీడీపీ–జనసేన కూటమి సర్కార్‌ తీరుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి సమరశంఖం పూరించారు. 

పులివెందులలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న  వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు 

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిరసన ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజలు 

నెల్లూరులో బైక్‌ ర్యాలీ చేపట్టిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు 

ప్రజా ఉద్యమానికి వైఎస్‌ జగన్‌ పిలుపు.. 
సూపర్‌ సిక్స్‌ సహా 143 హామీలతో టీడీపీ–జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోతో ఎన్నికల ప్రచారం చేసింది. కానీ.. అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోను తుంగలో తొక్కింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోకుండా అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు రెండేళ్ల దగా పాలనపై ఈనెల 4 నుంచి 12వతేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చిన విషయం తెలి­సిందే. ఆమేరకు నిరసన కార్యాచరణ షెడ్యూలు­ను ప్రకటించారు.

చంద్రబాబు చేసిన మోసం, దగా, వెన్నుపోటుకు సంబంధించి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్‌లెట్‌ను విడుదల చేసి.. అది గ్రామ గ్రామానా, ఇంటింటికీ చేర్చాల­ని దిశా నిర్దేశం చేశారు. వైఎస్‌ జగన్‌ పిలుపు మేరకు ఈనెల 4న అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన నిరసన ర్యాలీల్లో జనం స్వచ్ఛందంగా కదలివచ్చి కదం తొక్కుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను దహనం చేశారు. ఈనెల 8, 9న నియోజకవర్గాల కేంద్రాల్లో చంద్రబాబు సర్కార్‌ దగా పాలనపై వైఎస్సార్‌సీపీ నిర్వహించిన  సదస్సులకు ప్రజలు కదలివచ్చి.. కూటమి సర్కార్‌ మోసాలను వివరిస్తూ గళం విప్పారు.  

రెండేళ్లలో ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న సర్కారిదే.. 
నియోజకవర్గాల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలకు భారీ ఎత్తున జనం కదలివస్తారని ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా పసిగట్టిన చంద్రబాబ సర్కార్‌ యధావిధిగా పోలీసులను ప్రయోగించింది. నియోజకవర్గాల కేంద్రాలకు ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలివెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీన్ని ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఏమాత్రం లెక్క చేయకుండా ఉప్పెనలా కదిలి రావడంతో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలు, కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఇంత ప్రజావ్యతిరే­కత మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని గతంలో ఎన్న­డూ చూడలేదని సర్వత్రా చర్చ జరుగుతోంది.  

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)