రామాయపట్నం పోర్టు ముట్టడి ఉద్రిక్తం

Published on Sun, 07/19/2026 - 02:39

కందుకూరు: చంద్రబాబు ప్రభుత్వం రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరించడా­న్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శనివారం భారీ ఆందో­ళన చే­పట్టింది. పోర్టు ముట్టడికి తరలివ చ్చిన పార్టీ శ్రే­ణు­లు, రై­తు­లను పోర్టు లోపలికి వెళ్లకుండా పో­లీసులు అడుకోవడంతో పోలీసుల­కు, వైఎస్సార్‌సీపీ శ్రేణు­లకు మధ్య తోపు­లాట జరిగింది. పోర్టు సందర్శన­కు అనుమతించకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ప్రభుత్వ బండారం బయటపడుతుందన్న భయంతోనే అనుమతించడంలేదంటూ నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

భారీ బైక్‌ ర్యాలీ 
రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌ యా­దవ్‌ ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు, నేతలు, రైతు­లు, యువత పోర్టు సమీపంలోని జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కావలి నియో­జకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పార్టీ శ్రేణులు కావలి నుంచి ర్యాలీగా వచ్చారు.16వ నంబర్‌ జాతీయ రహదారి నుంచి పోర్టు వరకు భారీ బైక్‌ ర్యా­లీ చేశారు. ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నా­రు. పోర్టుకు కిలోమీటర్‌ దూరంలో టిప్పర్‌లు, ఇనుప రే­కులతో రోడ్డును మూ­సివేసి పోలీసులు అడ్డుగా నిలబడ్డారు. 

లోపలికి అనుమతించాలని కాకాణి,  బుర్రా,  ప్ర­తాప్‌­కుమార్‌రెడ్డి పోలీసులను కోరారు. వైఎ­స్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎన్నో వ్యయప్రయాసలకు ఎదు­రొ­డ్డి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన పోర్టు­లో కార్యకలాపాలు ప్రారంభమయ్యే దశలో చంద్రబాబు తన బినామీల­కు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అస­లు పోర్టులో ఏం జరుగుతోందో తెలుసుకునే హక్కు తమకు ఉందని, అడ్డు తొలగాలని గట్టిగా కోరారు. అయినా పోలీసులు పార్టీ నేతలు, శ్రేణులను వెనక్కి నెట్టేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

గంటన్నర పాటు పోలీసులకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మధ్య వాదోపవాదాలు, తోపులాటలు, నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది.  లోపలికి అనుమతి లేదని పోర్టు సీఈవో లెటర్‌ ఇచ్చారని, ముగ్గురు నేతలను మాత్రమే లోపలికి అనుమతిస్తామని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. కనీసం 50 మందిని అనుమతించాలని కాకాణి పట్టుపట్టారు. దీ­నికీ పోలీసులు ససేమిరా అన్నారు. పోర్టు సీఈవోని బయటకు పిలిపించి తమతో మాట్లాడించాలని, లేదంటే తమ­ను పోర్టులోకి తీ­సుకెళ్లాలంటూ నేతలు పట్టుపట్టారు. పో­ర్టు నిర్మాణానికి 3 గ్రామాలను ఖాళీ చేసి 850 ఎకరాలు ఇచ్చామని, కానీ చంద్రబాబు ప్రభుత్వం తమ భూములతో వ్యాపారం చేస్తోందని స్థానిక రైతులు మండిపడ్డారు. 

భూములి చ్చిన రైతులు­­గా పోర్టు నిర్మాణం ఎలా ఉందో తెలుసుకునే హక్కు తమకుందని, లోపలికి పంపాలని డిమాండ్‌ చేశారు. అ­యినా పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో వైఎస్సార్‌­సీపీ శ్రేణులు, రైతులు, యువత జాతీయ రహదారి 16పై రాస్తారోకోకు దిగారు. రహదారిపై కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై బైఠాయించిన కాకాణి, బుర్రా, రామిరెడ్డిలను పోలీసులు ఈడ్చుకెళ్లారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య మరోసారి తోపులాట జరిగింది. నేతలను, కార్యకర్తలను గుడ్లూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. బుర్రా, కాకాణి, ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మరో 15 మంది నేతలపై జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారంటూ అక్రమ కేసులు నమోదు చేసి సొంత పూచీకత్తుపై అందరినీ విడుదల చేశారు.

ప్రజల ఆస్తులను తెగనమ్మడమే చంద్రబాబు లక్ష్యం 
వేల కోట్లు విలువ చేసే ప్రజల ఆస్తులను అతి చవగ్గా తెగనమ్మి, తన కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని, దీనిలో భాగమే రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం రామాయపట్నం పోర్టు ముట్టడి కార్యక్రమం సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మధుసూదన్‌ యాదవ్‌తో కలిసి కాకాణి విలేకరులతో మాట్లాడారు. దాదాపు నిర్మాణం పూర్తయి, 5 శాతం పనులే మిగిలి ఉన్న దశలో రామాయపట్నం పోర్టును చంద్రబాబు సొంత మనుషులకు కట్టబెడుతున్నారని అన్నారు. 

‘‘రూ 5వేల కోట్లు విలువ చేసే ఆస్తిని రూ 1,500 కోట్లకే ఇస్తున్నారు. పోర్టు నిర్మాణానికి తీసుకున్న రూ. 2,079 అప్పును ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నారు. మిగిలిన 5శాతం పనులను ప్రభుత్వమే చేస్తుందని, లేని పక్షంలో లబ్దిదారుడు ఆ పనులు చేసి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రూ 1500 కోట్లలో మినహాయించుకోవచ్చని చెబుతున్నారు. ఇది దో­పిడీ కాక మరేమిటి?’ అని ప్రశ్నించారు.  రామాయపట్నం పో­ర్టు ఈ ప్రాంత ప్రజలకు జగన్‌ ఇచ్చిన హక్కు అని. దా­నిని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తుంటే చూస్తూ ఊరుకోలే­మని బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ అన్నారు. ప్రభుత్వ ఆ­స్తులను అమ్మి దోచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారని రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)