Breaking News

ఉరవకొండలో ఉద్రిక్తత.. విశ్వేశ్వర రెడ్డి అరెస్ట్‌

Published on Mon, 08/03/2026 - 06:58

వైఎస్సార్‌సీపీ ధర్నా అప్‌డేట్స్‌..

మాజీ ఎంపీ అరెస్ట్‌..

  • ఉరవకొండలో ఉద్రిక్తత
  • వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి చేపట్టిన ధర్నాకు హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్
  • గోరంట్ల మాధవ్‌ను బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు
  • పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
  • మంత్రి పయ్యావుల కేశవ్ భూ అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

విశ్వేశ్వర రెడ్డి కామెంట్స్....

  • పోలీసులకు హైకోర్టు ఉత్తర్వుల కన్నా మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలే ముఖ్యమా?
  • మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ప్రైవేటు ఆస్తులపై టీడీపీ నేతల పెత్తనం ఏంటి?
  • వేల్పుమడుగులో వైఎస్సార్‌సీపీ నేతకు చెందిన భూమిపై కావాలనే వివాదం సృష్టిస్తున్నారు
  • పోలీసులు, రెవెన్యూ అధికారులు టీడీపీ నేతలకు వత్తాసు పలకడం దుర్మార్గం
  • మంత్రి పయ్యావుల కేశవ్ భూ అక్రమాలపై ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం.

ఉరవకొండలో ఉద్రిక్తత

  • మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్
  • ఉరవకొండ వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి విశ్వేశ్వరరెడ్డిని ఈడ్చుకెళ్లిన పోలీసులు
  • పోలీసులకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట
  • విశ్వేశ్వర రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పయ్యావుల కేశవ్ కుట్ర రాజకీయాలకు నిరసనగా నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని విశ్వేశ్వరరెడ్డి తాజాగా వీడియోలో వెల్లడించారు.

అయితే, విడపనల్ మండలం వేల్పుమడుగులో వైఎస్సార్‌సీపీ నేత గోవింద్‌కు చెందిన 21 ఎకరాల భూమిని ఆలయ భూమిగా టీడీపీ, బీజేపీ నేతలు పేర్కొంటున్నారని, అయితే ఆ భూమి ప్రైవేటు భూమేనని రెవెన్యూ అధికారులు గతంలో స్పష్టం చేశారని వైఎస్సార్‌సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, ఆ భూమికి సంబంధించి హైకోర్టు కూడా వైఎస్సార్‌సీపీ నేతకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు.

కాగా, మంత్రి పయ్యావుల కేశవ్ ఒత్తిడి కారణంగా హైకోర్టు ఆదేశాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు అమలు చేయడం లేదని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. దీనికి నిరసనగా ఉరవకొండలో ధర్నాకు పిలుపునిచ్చినట్లు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)