Breaking News

చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?: వైఎస్ జగన్‌

Published on Tue, 05/27/2025 - 20:46

తాడేపల్లి: తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై ఏపీ పోలీసులు థర్డ్ ప్రయోగించడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో చంద్రబాబు సర్కారు తీరును ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కారు భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా  ఎలా ఉల్లంఘిస్తుందో అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? అంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ వేదికగా ఆ యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

‘చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం.. పోలీసులకు అపరిమిత అధికారాన్ని వినియోగించుకునే అవకాశాన్ని ఇచ్చి భారత రాజ్యాంగాన్ని బహిరంగంగానే ఉల్లంఘిస్తోంది. చట్ట పరంగా పాలనను సాగించడానికి బదులుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. మానవ హక్కులను వారి రక్షణను గాలికొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని యధేచ్ఛగా అమలు చేస్తుంది.   పోలీసులు చట్ట విరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలతో సహా ప్రతి పౌరుడి హక్కులను కాలరాస్తున్నారు. తెనాలిలో దళిత, మైనారిటీ యువకులైన జాన్ విక్టర్, రాకేష్, షేక్ బాబులాల్‌లను పోలీసు అధికారులు దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. 

నడిరోడ్డుపై కూర్చోపెట్టి పట్టపగలే అరికాళ్లపై లాఠీలతో కొట్టారు. ఒక సిఐ వారి కాళ్లను తన కాలితో అదిమి పెట్టగా, మరొక అధికారి వారిని కొట్టారు మిగతా పోలీసులు పక్కనే ఉండి ఆ దారుణాన్ని చిత్రీకరించారు. పైగా లాఠీలు విరిగితే కొత్తవి అందించారు. నెల క్రితం ఈ సంఘటన జరిగినా ఈ విషయంపై మాట్లాడటానికి కూడా జనం భయ పడ్డారు. ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ మరోసారి తెలిసింది. ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు అనేకం రాష్ట్రంలో జరిగాయి. 

ఏపీలో ఒక భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు అన్యాయంగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్య పునాదులనే అపహాస్యం చేస్తున్నారు. ఈ సంఘటన మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించటమే. ఇది రాజ్యాంగ విలువలపై ప్రత్యక్షంగా జరిగిన దాడి. ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు కోర్టుల దృష్టికి తీసుకుని వెళ్లాలి.అంతేగానీ ఇలా బహిరంగంగా దాడి చేయటానికి ప్రజాస్వామ్యం అంగీకరించదు.  భారత రాజ్యాంగాన్ని బాబు సర్కారు బహిరంగంగానే ఉల్లంఘించి అరాచక పాలన సాగిస్తుందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి. జరగిన ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు ట్యాగ్‌ చేశారు వైఎస్‌ జగన్‌.

 
చదవండి: 

దళిత, మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్‌ ‘బూటు’ దెబ్బ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)