Breaking News

‘అమ్మవారి ఆలయంలో వెంటనే శుద్ధి కార్యక్రమం చేపట్టాలి’

Published on Sat, 01/10/2026 - 11:17

విజయవాడ:  కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరుసగా అపశ్రుతులు జరుగుతుండటంపై వెంటనే శుద్ధి కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్‌ డిమాండ్‌ చేశారు.   ప్రచారం మీద ఉన్న శ్రద్ధ.. పవిత్రతను కాపాడటం లేదా ఈవో గారు అంటూ పోతిన మహేష్‌ ప్రశ్నించారు. ‘కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరుసగా అపశ్రుతులు జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయంలో వెంటనే శుద్ధి కార్యక్రమం చేపట్టాలి.వైదిక కమిటీ ఏం చేస్తుంది?, ఆలయంలో సెక్యూరిటీ ఏం చేస్తుంది? తనిఖీలు గాలికి వదిలేశారా? అని నిలదీశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు పోతిన మహేష్‌.

పోతిన మహేష్‌ లేవెనెత్తిన అంశాలు..
1. అమ్మవారి ఆలయంలో కరెంట్ బిల్లు చెల్లించలేదని విద్యుత్ సరఫరా నిలిపివేయడం అమ్మవారికి చీకటిలోనే నైవేద్యం సమర్పించే దుస్థితికి చేరుకోవడం 
2. అన్న ప్రసాదంలో పనిచేసే వర్కర్లకు రోజువారి వేతనం అన్నదాన సర్వీస్ కాంట్రాక్టర్ తక్కువగా చెల్లిస్తున్నారని ఆలయంలోనే ఆందోళన చేసిన సంఘటన 
3. విశిష్ట పూజలకు ఉపయోగించే పాలల్లో పురుగులు 
4. అమ్మవారి గర్భగుడికి అతి చేరువలోనే కేక్ కటింగ్ కార్యక్రమం 
5. ఒక అమ్మవారి ఆలయంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి హిందూ దేవాలయాల లో వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాలతో పాటు మిగిలిన దేవాలయాల్లో కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన అధికారుల అవినీతి వలన అని స్పష్టంగా చెప్పగలం 

6. అమ్మవారి ఆలయం లో కమిషనర్ గారు కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించినా EO గారు కాంట్రాక్టర్ లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు స్టాండింగ్ కౌన్సిల్ మరియు అసిస్టెంట్ కమిషనర్ కోర్ట్ వారికి నిజాలు తెలియజేయరా?

7. తిరుమలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతిసారి ఏదో ఒక అపశ్రుతి అపచారం జరుగుతూనే ఉంది మద్యం మాంసాహారం చెప్పులు వేసుకుని ప్రధాన ఆలయ ద్వారా వరకు వెళ్లడం తొక్కిసలాట ఘటనలు మరణాలు సంభవించడం అనేకం 

ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న టీటీడీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి ఆలయ అధికారులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చి మరీ రాజీనామా చేశారు అంటే కూటమి ప్రభుత్వ వైఫల్యం తిరుమలలో అధికారుల అవినీతి ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో హిందూ భక్తులు అర్థం చేసుకోవచ్చు.

ఇదీ చదవండి:
విజయవాడ దుర్గగుడిలో మరో నిర్లక్ష్యం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)