వైఎస్సార్‌సీపీలో నూతన నియామకాలు

Published on Fri, 07/24/2026 - 10:45

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీలో నూతన నియామకాలు జరిగాయి. పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పలువురు నేతలకు కొత్త బాధ్యతలు అప్పగించారు.

వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ (PAC) సభ్యునిగా పీవీఎల్‌ నరసింహరాజును నియమించారు. పార్టీ కార్యక్రమాలు, రాజకీయ వ్యూహాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే PACలో ఆయనకు స్థానం కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో.. 

ఉండి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంతెన యోగీంద్రకుమార్‌ (బాబు)ను నియమించారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం వంటి బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.

గత ఎన్నికల అనంతరం పార్టీని పునర్‌వ్యవస్థీకరించే పనిలో ఉన్న వైఎస్సార్‌సీపీ.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే అనుభవం ఉన్న నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేతలు పార్టీ కార్యక్రమాలను మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్తారని వైఎస్సార్‌సీపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వచ్చే రోజుల్లో మరిన్ని సంస్థాగత మార్పులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)