Breaking News

‘జాబ్ కేలండర్ అదిగో, ఇదిగో అంటూ నమ్మించి దగా చేశారు’

Published on Thu, 03/05/2026 - 18:04

తాడేపల్లి : నిరుద్యోగులను చంద్రబాబు నిలువునా మోసం చేశారని  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. జాబ్ కేలండర్ అదిగో, ఇదిగో అంటూ నమ్మించి దగా చేశారని  మండిపడ్డారు. ఈరోజు(గురువారం, మార్చి 5వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన మొండితోక అరుణ్‌కుమార్‌..  చంద్రబాబు హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు కంటే తొలగించినవే ఎక్కువంటూ విమర్శించారు. 

‘చంద్రబాబు మాటలేమో మిలియన్స్‌లో ఉంటాయి, గ్రౌండ్‌లోనేమో అన్నీ వేకెన్సీలే కనబడుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సొల్లు కబుర్లు చెప్పారు. నారా లోకేష్ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మంత్రి 5.77 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. చంద్రబాబేమో ఏకంగా 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ముగ్గురూ మూడు రకాల మాటలు చెప్పారు. అందరూ కలిసి ప్రజలను మభ్యపెట్టటమే పనిగా పెట్టుకున్నారు. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో ఆ వివరాలు ఇవ్వమంటే పారిపోతున్నారు. 

అసలు ఈ ప్రభుత్వ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి?, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా ఎందుకు చెప్పరు?, కాకి లెక్కలతో కాలం వెళ్లబుచ్చటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. ఏపీలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని కేంద్రమే పార్లమెంటులో ప్రకటించింది. ఏపీలో నిరుద్యోగం రేటు 4.1% పెరిగిందని కేంద్రమే తేల్చి చెప్పింది. అనేక సర్వే సంస్థలు 8% నిరుద్యోగం పెరిగిందని చెప్తున్నాయి. చీఫ్ జాబ్ క్రియేటర్‌ని అని చెప్పుకునే లోకేష్ మరి 8% నిరుద్యోగం పెరుగుతుంటే ఏం చేస్తారు?, దీన్ని బట్టే లోకేష్ క్రియేటివిటీ, సమర్ధత ఏపాటిదో అర్ధం అవుతోంది. ఏపీకి పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు పెరిగితే మరి జీఎస్టీ ఎందుకు తగ్గుతోంది?, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఏమయ్యాయి?, ప్రజల్లో కొనుగోలు శక్తి ఏమయ్యాయి?, మా హయాంలోని డీఎస్సీ అమలు చేసి అదికూడా తమ గొప్పగా లోకేష్ చెప్పుకోవటం సిగ్గుచేటు.

ఉద్యోగాలు భారీగా పెరిగితే గతేడాది ప్రతి 18 గంటలకు ఒక నిరుద్యోగి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?, ఏ విభాగంలో ఎన్ని ఉద్యోగాలు, ఎవరెవరికి ఇచ్చామో డీటైల్స్ అన్నీ డొమైన్ లో పెట్టాం. మరి చంద్రబాబు ఇచ్చినట్టు చెప్తున్న 6.28 లక్షల ఉద్యోగాల వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టటం లేదు?, చంద్రబాబు హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు కంటే తొలగించినవే ఎక్కువ. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతుంటే.. మరోవైపు ఎక్కువ మంది పిల్లల్ని కనమని చంద్రబాబు సలహా ఇస్తున్నారు. ఇదేనా చంద్రబాబు విజన్?, ముందు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ తర్వాత సలహాలు ఇస్తే బాగుంటుంది’ అని సూచించారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)