Breaking News

నాడు అరచేతిలో వైకుంఠం.. నేడు మోసం

Published on Sun, 10/19/2025 - 05:12

తాడేపల్లి: అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాదిన్నర తర్వాత ఉద్యోగులకు కేవలం ఒకే ఒక్క డీఏ ప్రకటించి, ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందని మాజీ మంత్రులు కాకాణి గోవర్థన్‌రెడ్డి, మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమిటి.. ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటని నిలదీశారు. తీపి తీపి మాటలతో అరచేతిలో నాడు వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేయడం దుర్మా­ర్గం అని ధ్వజమెత్తారు. ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చిందని నిలదీశారు.

ఉద్యోగులను నిలువునా ముంచారన్నారు. కేబినెట్‌ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరం మీద తప్ప, ప్రజల మీద, ఉద్యోగస్తుల మీద ఇసుమంత కూడా లేద­న్నారు. ‘అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజల మీద, ఉద్యోగుల మీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవటం, మీకు అలవాటే. ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచి్చన వెంటనే ఐఆర్‌ అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన పీఆర్సీ అంటూ ఊదరగొట్టారు. మరి ఆ సంగతి ఏమైంది? మేము నియమించిన పీఆర్సీ చైర్మన్‌ను వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవ్వరినీ నియమించ లేదు.

సీపీఎస్, జీపీఎస్‌ రెండింటినీ సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ ఎన్నికల ముందు కబుర్లు చెప్పారు. కానీ, వాటిపై ఒక్కసారి కూడా సమీక్షించలేదు. బకాయిలు, పెండింగ్‌ డీఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ మాటెత్తడం లేదు. మొత్తంగా రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు. ఇప్పుడు ప్రకటించిన డీఏను గత ఏడాది జవనరి 1 నుంచి ఇవ్వాలి. మరి ఆ బకాయిల చెల్లింపుపై మీ నోటి నుంచి ఏ మాటా రాలేదు. ఇది మరో మోసం. వలంటీర్ల జీతాలు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి, ఏకంగా వారి పొట్టకొట్టి రోడ్డు మీద పడేశారు. ఆరీ్టసీలో పని చేస్తున్న దాదాపు 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్‌ చేయడాన్ని తప్ప­న్నట్లు మాట్లాడటం దారుణం’ అని మండిపడుతూ శనివారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)