Breaking News

బాలికపై జనసేన నేత లైంగిక దాడి

Published on Sat, 11/01/2025 - 05:16

ఐ.పోలవరం: రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అక్రమాలు, దౌర్జన్యాలు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాల్లో కూటమి నేతలు ముందుంటున్నారు. కాకినాడ జిల్లా తునిలో ఇటీవల గురుకుల పాఠశాల విద్యార్థినిపై టీడీపీ నాయకుడు నారాయణరావు అఘాయిత్యానికి పాల్పడటం, ఆనక అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తెలిసిందే. ఇప్పుడు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఓ జనసేన నాయకుడు ఆరో తరగతి చదువుతున్న బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 

తండ్రి లేని 11 ఏళ్ల బాలికకు చాక్లెట్లు ఇచ్చి, మాయమాటలతో లోబరుచుకుని పలు పర్యాయాలు లైంగిక దాడి జరిపాడు. ఈ బాగోతం బయటపడితే పరువు పోతుందని కొందరు కూటమి నేతలు ఆ బాలిక తల్లితో పాటు బంధువులతో కేసు లేకుండా రాజీ చేసేందుకు యత్నించారు. రాజకీయంగా తీవ్ర ఒత్తిళ్లు కూడా తెచ్చారు. అయినప్పటికీ బాలిక తల్లి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విష­యం వెలుగులోకి వచ్చింది. 

బాలిక తల్లి నిలదీయడంతో.. 
అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరం సమీప గ్రామానికి చెందిన బాలికపై బాణాపురానికి చెందిన జనసేన యువజన నాయకుడు రాయపురెడ్డి సత్యవెంకటకృష్ణ (బాబీ) ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ బాలిక తన తల్లితో కలసి పూరి గుడిసెలో నివసిస్తోంది. ఆ బాలికకు బాబీ మాయమాటలు చెప్పి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

గ్రామ సమీపంలోని ఒక భవనం నుంచి ఆ బాలికతో కలసి బాబీ గురువారం బయటకు వస్తుండగా ఆమె తల్లి అనుమానంతో నిలదీసింది. దీంతో తనపై బాబీ అనేక పర్యాయాలు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆ బాలిక చెప్పింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. వారు గురువారం రాత్రి జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనాను  కలిసి ఫిర్యాదు చేశారు. వెంకట కృష్ణపై పోక్సో, బీఎన్‌ఎస్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. 

రాజీకి తీవ్ర యత్నాలు 
బాబీని కేసు నుంచి తప్పించేందుకు, రాజీ చేసేందుకు జనసేన, టీడీపీ నేతలు తెరవెనుక తీవ్రంగా యతి్నంచారు. అయితే, బాలిక తల్లి సహా కుటుంబ సభ్యులు ససేమిరా అనడంతో చివరకు అమలాపురం డీఎస్పీ ప్రసాద్‌ శుక్రవారం కేసు నమోదు చేసి, విచారణ జరిపారు. డీఎస్పీ కథనం ప్రకారం.. నిందితుడు బాబీ ఐ.పోలవరం జెడ్పీ హైసూ్కల్‌లో విద్యాకమిటీ సభ్యుడు. క్రీడాకారుడు కావడంతో విద్యార్థులకు క్రీడా శిక్షణ ఇస్తుంటాడు. 

బాధితురాలు నిందితుడికి సమీప బంధువు. ఆమె తండ్రి రెండేళ్ల క్రితం మృతి చెందారు. తల్లి ఆక్వా కార్మికురాలు. నిందితుడు ఆ బాలికకు తరచూ చాక్లెట్లు కొనిపెడుతూ తన బంధువుకు చెందిన ఖాళీగా ఉన్న ఇంట్లో అఘాయిత్యానికి  బరితెగిస్తున్నట్టు విచారణలో తేలిందని డీఎస్పీ చెప్పారు. నిందితుడి బారిన పడిన వారిలో ఇంకొందరు బాలికలూ ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పరారీలో ఉన్న నిందితుడు బాబీని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.

వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ముమ్మిడివరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ పొన్నాడ వెంకటసతీష్ కుమార్, పార్టీ సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, కాశి మునిబాలకుమారి తదితరులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)