Breaking News

‘తన్మయి కేసు.. సీఐను సస్పెండ్ చేస్తే సరిపోతుందా?’

Published on Thu, 06/12/2025 - 13:26

సాక్షి, అనంతపురం: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి గిరిజనులు అంటే చులకనా అని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా?.. మహిళలు, చిన్నారులపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గిరిజన ఇంటర్ విద్యార్థి తన్మయిది ప్రభుత్వ హత్యే. ఈనెల మూడో తేదీన ఫిర్యాదు అందితే.. ఎందుకు గాలింపు చర్యలు చేపట్టలేదు?. తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీఐను సస్పెండ్ చేస్తే సరిపోతుందా?. నలుగురు అనుమానితులు ఉంటే.. ఒకరిపైనే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి గిరిజనులు అంటే చులకనా?. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా?. మహిళలపై అఘాయిత్యాలు పట్టించుకోరా? అని ప్రశ్నించారు.

మరోవైపు.. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఇంటర్ విద్యార్థి తన్మయి దారుణ హత్య జరిగింది. గిరిజన బాలిక తన్మయి మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. బాధిత కుటుంబానికి పరిహారం, భూమి, ఇంటి స్థలం ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు.

 

 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)