Breaking News

డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి : బొత్స

Published on Thu, 06/18/2026 - 18:06

సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వ మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అయ్యిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. గురువారం బొత్స ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతల బృందం లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను కలిసింది. డీఎస్సీ సహా కీలక అంశాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు.

మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారు. ఆధారాలతో సహా మేం చెబుతున్నాం. ఆరోపణలు వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది పేపర్ సెట్ చేసిన దగ్గర్నుంచి ఉద్యోగాలు ఇచ్చే వరకూ అంతా అక్రమమే. డీఎస్సీని పూర్తయ్యాక మెరిట్ లిస్ట్ ను ప్రకటించడం ఆవనాయితీ కానీ ఎక్కడా మెరిట్ లిస్ట్ ప్రదర్శించలేదు.ఆరోపణలు విమర్శలు వచ్చాక లిస్ట్‌ను వెబ్‌సైట్‌లో పెట్టారు. నేనే సాక్ష్యం. స్వయంగా నేను నలుగురు డీఈవోలతో మాట్లాడా.

తప్పు జరగనప్పుడు దాపరికం దేనికి. ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టే ఇలా చేశారు. పదోతరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకున్నాం. క్లబ్‌లలో ఆడే పేకాట బ్రిడ్జి గేమ్‌ను కూడా స్పోర్ట్స్ కోటాలో పెట్టారు. బ్రిడ్జి గేమ్‌ను గత ప్రభుత్వం పెట్టినట్లు ఆధారాలుంటే రుజువు చేయండి. అర్హులకు కాకుండా అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. సీబీఐ విచారణతోనే అక్రమాలు బయటపడతాయి. నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. సమగ్రవిచారణ జరిపించాలని గవర్నర్ ను కోరాం. విద్యార్ధుల భవిష్యత్, మనోభావాలాతో ఆడుకోవద్దని ఒక సెక్షన్ మీడియాను కోరుతున్నాం. ఈ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియపై ఎలాంటి నమ్మకం లేదు.

అవసరమైతే అధికారులు రండి. మేం చర్చకు సిద్ధం. సిబిఐ విచారణ జరిగే వరకూ మా పోరాటం కొనసాగిస్తాం. లోకేష్‌వి పిల్ల చేష్టలు. మంత్రిగా ఉండి లోకేష్ మాట్లాడే మాటలు సరికాదు. మీ ఇంటికొస్తాం..మాకు 200 మీటర్లేనని లోకేష్ మాట్లాడుతున్నారు. గతంలో ఇదే మాట మాట్లాడిన జోగి రమేష్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు.

గవర్నర్ ఇంటి ముందే మేం ఉన్నాం..రమ్మనండి లోకేష్‌ని. అవగాహనలేని మాటలతో చేసేవన్నీ పిల్లచేష్టలే.మేం మొదటి నుంచి మంత్రి లోకేష్ ను డిమాండ్ చేస్తున్నాం. డీఎస్సీ పై స్పందించాలని కోరాం. ఇన్నాళ్లకు లోకేష్‌ గుర్తొచ్చిందా. 2004లో మంత్రిగా ఉన్న నాపై వోక్స్ వ్యాగన్ డబ్బులు తినేశారని ఆరోణలు వచ్చాయి. సీబీఐ విచారణ జరిపించాలని మేమే కోరాం. ఆరోజు సిబిఐ విచారణ జరిగింది కాబట్టే మేం ఆరోపణల నుంచి బయటపడ్డాం. అందుకే డీఎస్సీ అక్రమాల పై సిబిఐ విచారణ కోరుతున్నాం. లాకప్ డెత్ ..విషయంలో పార్టీలు కాదు..మానవత్వం చూడాలి. ఒక అధికారిని బలిచేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. గాదె సాయికృష్ణది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ఈ హత్యకు కారకులైన అందరినీ శిక్షించాలి. గాదె సాయికృష్ణ కేసును సిబిఐతో విచారణ జరిపించాలి’అని డిమాండ్‌ చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)