Breaking News

వనవాసంలో ‘పిన్నెల్లి’ ప్రజలు

Published on Fri, 03/14/2025 - 05:47

సాక్షి, నరసరావుపేట:     రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో.. కట్టుబట్టలతో సొంత ఊరిని వీడిన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామ­స్తులు వనవాసం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాత్రికి రాత్రి ఊరు వదిలి వెళ్లిపోవాలని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. కాదన్న వారి ఇళ్లపై మూకుమ్మడిగా దాడి చేసి విధ్వంసం సృష్టించారు.

కాపాడాల్సిన పోలీసులు తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. టీడీపీ నేతలకే వత్తాసు పలుకుతూ గ్రామం వీడి వెళ్లిపోవాలని బాధితులకు సలహాలిచ్చారు. స్వయంగా పల్నాడు ఎస్పీ గ్రామంలో పర్యటించి వెళ్లిన గంటల వ్యవధిలోనే మరోసారి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడులకు తెగబడ్డా చూసీ చూడనట్లు వ్యవహరించారు. దీంతో వందలాది కుటుంబాలు పుట్టిన ఊరిని వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లాయి. ఇప్పటికీ పిన్నెల్లి వాసులు సొంతూరికి రాలేని దుస్థితి నెలకొంది. 

వలస కూలీలుగా....
పదుల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతులు సైతం టీడీపీ మూకల దాడులకు భయపడి వేరే ప్రాంతాల్లో వలస కూలీలుగా బతుకీడుస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు, నరసరావుపేట, పిడుగురాళ్ల, దాచేపల్లి తదితర చోట్ల పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఒకప్పుడు బాగా బతికిన రైతులు ఇప్పుడు అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌లుగా గడుపుతు­న్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు చెందిన పొలాలను ఇతరులు సాగు చేయనివ్వకుండా బీడు పెట్టారు. కొందరి భూములను దౌర్జన్యంగా అక్రమించారు.  

అంత్యక్రియలకూ అనుమతించలేదు..
పిన్నెల్లి నుంచి వలస వెళ్లిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను కనీసం కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు సైతం రానివ్వకుండా టీడీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారు. పిన్నెల్లికి చెందిన షేక్‌ అల్లా బ„Š  అనారోగ్య కారణాలతో మృతి చెందగా ఆయన శవాన్ని గ్రామానికి తరలించేందుకు టీడీపీ నేతలు ఒప్పుకోక­పోవడంతో గుంటూరులోనే అంత్యక్రియలు పూర్తి చేయాల్సి వచ్చింది. మాడుగుల అల్లు చనిపోతే కనీసం నలుగురు కూడా లేకుండా అంతిమ సంస్కారాలు పూర్తి చేయాల్సి వచ్చింది.

ఆస్తులు ధ్వంసం..
ఎన్నికల ఫలితాలు వెలువడగానే పిన్నెల్లిలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి­పరులు గ్రామంలో బతకలేని పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్‌సీపీకి చెందిన వారెవరూ గ్రామంలో ఉండటానికి వీల్లేదని గ్రామంలో దండోరా వేయించారంటే టీడీపీ నేతల దురాగతాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించవచ్చు. ఇప్పటికి 400కు పైగా కుటుంబాలు పిన్నెల్లి గ్రామంలోకి రాలేని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను గ్రామం నుంచి వెళ్లగొట్టే క్రమంలో టీడీపీ నేతలు వారి ఇళ్లను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)