Breaking News

అధైర్య పడకండి.. అండగా ఉంటాం

Published on Sun, 07/19/2026 - 02:03

సాక్షి, అమరావతి:/లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌): గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కృష్ణబాబు కాలనీ 21వ డివిజన్‌లోని మహిళ, ఆమె కుటుంబ సభ్యులపై టీడీపీ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి మల్లెల మూర్తి, అతని కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటనను వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. శనివారం బాధిత కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా తదితరులు పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని..అధైర్యపడవద్దని బాధితురాలికి భరోసా ఇచ్చారు. అనంతరం నూరిఫాతిమా, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

మహిళను ఉద్దేశపూర్వకంగానే అత్యంత క్రూరంగా రోడ్డుపై వివస్త్రను చేసి దాడి చేసి గాయపరిచారని విమర్శించారు.ఈ కేసులో టీడీపీ పెద్దలు రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. టీడీపీ పాలనకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ గుంటూరు సిటీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళల రక్షణ కేవలం మాటలకే పరిమితమైందని మండిపడ్డారు. గుంటూరులో ముగ్గురు మంత్రులు, ఒక కేంద్ర మంత్రి, మహిళా కమిషన్‌ ఆఫీస్‌ ఉన్నా ఈ ఘోరం జరగడం శోచనీయమన్నారు. ఒక మహిళకు ఇంతటి అన్యాయం జరిగితే ఎమ్మెల్యే గల్లా మాధవి నిందితుడినే కాపాడటం నీచమని అన్నారు.    

లంచం ఇవ్వలేదన్న కోపంతో గుంటూరులో టీడీపీనేత కీచకపర్వం
లంచం ఇవ్వలేదన్న కోపంతో టీడీపీ నాయకుడు  ఒక మహిళను వివస్త్రను చేసి వేధించారని గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సిగ్గు, శరం అనేది ఉంటే హోంమంత్రి అనిత ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కేసు నమోదు చేసిందే కాకుండా, నిన్ననే జరిగినట్టు, తాము వేగంగా స్పందించినట్టు ప్రజలకు చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 

సీసీ టీవీ ఫుటేజ్‌లు, సాక్షి మీడియా ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిందితుడైన టీడీపీ నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి, చేతులు దులిపేసుకున్నారన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి సెటిల్మెంట్‌ చేయాలని చూసినా, బాధితులు అంగీకరించకపోవడంతో ఆమె ఆటలు సాగలేదన్నారు. తాము బాధితురాలి ఇంటికి వెళ్లి, పరామర్శించి, వాస్తవాలు తెలుసుకున్నామని చెప్పారు. ఈ ఘటనలో తప్పంతా టీడీపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అంతకు ముందే ఒకసారి బాధితురాలు, ఆమె కొడుకుపై దాడి చేశారని, కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోలేదన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)