Breaking News

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

Published on Sun, 06/23/2024 - 05:04

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చట్టాన్ని లెక్క చేయడంలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ధ్వజమెత్తారు. హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయం భవనాన్ని కూల్చేశారని మండిపడ్డారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలన తొలిరోజు నుంచే నియంతృత్వ ధోరణితో సాగుతోందని అన్నారు. 

చంద్రబాబు నివసిస్తున్నదే అక్రమంగా కట్టిన కరకట్ట నివాసంలో అని, దాన్ని కూల్చేస్తామని గతంలో అదే పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన దేవినేని ఉమా∙చెప్పారని తెలిపారు. అదే అక్రమ కట్టడంలో ఉంటూ చంద్రబాబు నీతులు వల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలు వచ్చి న దగ్గర నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీడీపీ కూటమి నేతలు హింసాకాండకు పాల్పడటం ఈ ప్రభుత్వ ఉద్దేశాలను చెప్పకనే చెప్తున్నాయన్నారు. 

ఇప్పుడు ప్రభుత్వమే వైఎస్సార్‌సీపీ కార్యాలయాల ధ్వంసానికి దిగిందన్నారు. రాష్ట్రంలో అసలు రాజ్యాంగం ఉందా? చట్టం పనిచేస్తోందా? వ్యవస్థలు ఉన్నాయా? అన్న సందేహాలు కలుగుతున్నాయన్నారు. శనివారం అసెంబ్లీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు తేనె పలుకులు పలికారని, బయట మాత్రం కత్తులతో ప్రత్యర్థి రాజకీయ పార్టీ గొంతు కోయాలని చూస్తున్నారని చెప్పారు.  



సభ ఎలా జరుపుతారో అయ్యన్న నియామకమే చెబుతుంది 
ఎక్కువ బూతులు మాట్లాడేదెవరని యూ­ట్యూబ్‌­లో సెర్చ్‌ చేస్తే అయ్యన్నపాత్రుడినే చూపిస్తోందని, అలాంటి వ్యక్తిని స్పీకర్‌గా నియ­మించారంటే సభను ఎలా జరపాలనుకుంటున్నారో అర్థమవుతోందని సుధాకర్‌బాబు అన్నారు. తన స్నేహితుడితో అయ్యన్నపాత్రుడు మాట్లా­డిన మాటలు ప్రజలందరికీ తెలియాలంటూ సుధాకర్‌బాబు ఆ వీడియోను ప్రదర్శించారు. 

జగన్‌ కేవలం ఓడిపోయాడు కాని, చావలేదు, చచ్చేవరకూ కొట్టాలంటూ అత్యంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిని స్పీకర్‌ స్థానంలో కూటమి పార్టీలు కూర్చోపెట్టాయని ధ్వజమెత్తారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న స్పీకర్‌ విపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యులను మాట్లాడనిస్తారా.. అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ను అవమానించటానికి, ఆయన ఆస్తులను ధ్వంసం చేయడానికే చంద్రబాబు సీఎం అయ్యారా అని ప్రశ్నించారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)