Breaking News

‘ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం పచ్చి మోసం’

Published on Mon, 08/11/2025 - 19:47

తాడేపల్లి - మహిళలకు ఫ్రీ బస్సు అంటూ ఎన్నికలకు ముందు కూటమి నేతలు ప్రకటించిన పథకం పచ్చి మోసమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించొచ్చని చెప్పారని, ఇప్పుడు నిబంధనలు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ రోజు(సోమవారం, ఆగస్ట 11వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పుత్తా శివశంకర్‌..‘మొదటి ఏడాది స్త్రీ శక్తి పథకాన్ని ఎగ్గొట్టారు. రెండవ సంవత్సరం కూడా సగం పూర్తైపోయింది.  ప్పుడు కొన్ని రకాల బస్సులు మాత్రమేనని నిబంధనలు పెడుతున్నారు. 

రాంప్రసాద్ రెడ్డి మొదటిసారి గెలిచి మంత్రి అయ్యాడు  చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్టీసీ గురించి పట్టించుకోలేదు. 2019 నవంబర్ నాటికి ఆర్టీసీ రూ. 7629 కోట్ల నష్టాల్లో ఉంది. తొలిసారి సీఎం అయిన జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ భద్రత కల్పించారు.  మహిళలకు ఫ్రీ బస్ పేరుతో చంద్రబాబు, పవన్ ,నారా లోకేష్ ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చ‌న్నారు. 

అన్ని పుణ్య‌ క్షేత్రాల‌ను రూపాయి ఖ‌ర్చు లేకుండా సంద‌ర్శించ‌వ‌చ్చ‌న్నారు. ఎవ‌రైనా టికెట్ అడిగితే నా పేరు చెప్ప‌మ‌ని చంద్ర‌బాబు ఊద‌ర‌గొట్టాడు. నేనే సేఫ్ డ్రైవ‌ర్ అని చంద్రబాబు ప్ర‌చారం చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఆ పథకం ఏమైంది..?’ అంటూ నిలదీశారు. పుణ్య‌ క్షేత్రాల‌కు ఉచితంగా ఆర్టీసీ బ‌స్సుల్లో వెళ్లొచ్చ‌ని ఎన్నిక‌ల‌కు ముందు చెప్పారని, తిరుమ‌ల‌కు వెళ్లే స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ స‌ర్వీసులో కూడా టికెట్ తీసుకోవాల‌నే నిబంధ‌న పెట్టడం దారుణమని పుత్తా శివశంకర్‌ విమర్శించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)