నకిలీ మద్యం దోపిడీకి క్యూ ఆర్‌ కోడ్‌ అడ్డమే కాదు

Published on Fri, 10/17/2025 - 05:44

సాక్షి, అమరావతి : నకిలీ లిక్కర్‌ దందాకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై మద్యం ప్రియుల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో కంటి తుడుపు చర్యగా బాటిళ్లపై క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ విధానాన్ని తిరిగి పెడుతోందని, తద్వారా ఇన్నాళ్లూ నకిలీ లిక్కర్‌ అమ్మకాలు జరిపామని ప్రభుత్వం అంగీకరించినట్లే అని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

నకిలీ లిక్కర్‌ అమ్మకాలు ఎక్కువగా జరిగేది బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లలోనే కాబట్టి, నకిలీ మద్యం దోపిడీకి ‘క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌’ అడ్డమే కాదన్నారు. లూజ్‌ లిక్కర్‌ అమ్మకాలు జరిగే చోట క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌తో పనేంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ములకలచెరువు, ఇబ్రహీంపట్నం, అనకాపల్లి, తదితర ప్రాంతాల్లో నకిలీ లిక్కర్‌ దందా బయట పడినప్పుడే చుట్టుపక్కల మద్యం షాపులు, బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లలో తనిఖీలు చేయడంతో పాటు లక్షల్లో శాంపిల్స్‌ తీసుకుని నాణ్యతా ప్రమాణాలను పరిశీలించేవారని చెప్పారు. కానీ అలాంటి కార్యక్రమాలేవీ జరగక పోవడం చూస్తుంటే ఈ దందా వెనుక కూటమి పెద్దల ప్రమేయం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు.   

ఐదేళ్లలో రూ.40 వేల కోట్ల దోపిడీ లక్ష్యం 
‘కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యం కారణంగా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఐదేళ్లలో రూ.40 వేల కోట్ల భారీ దోపిడీకి ప్రభుత్వ పెద్దలు స్కెచ్‌ వేశారు. ములకలచెరువులో భారీగా నకిలీ మద్యం తయారీ యూనిట్‌ గుట్టురట్టయినా, దాని వెనుక టీడీపీ నాయకుల పాత్ర ఉందని తెలిసినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. మద్యం అమ్మకాల్లో 70 శాతం చీప్‌ లిక్కరే. అందువల్ల చీప్‌ లిక్కర్‌ ప్లేసులో అక్రమంగా తయారు చేసిన నకిలీ మద్యాన్ని ప్రవేశపెట్టి కూటమి పెద్దలు భారీ ఆదాయ వనరుగా మార్చుకున్నారు.

నకిలీ మద్యంపై వైఎస్సార్‌సీపీ ఉద్యమం చేయడంతో మద్యం బాటిళ్లపై క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ పేరుతో హడావుడి చేస్తోంది. అయితే మద్యం తాగే వారిలో చాలా మంది రోజువారీ కూలీలు. నిరక్షరాస్యులు. వారి దగ్గర స్మార్ట్‌ ఫోన్లు ఉండవు. అలాంటప్పుడు ఏది నకిలీ.. ఏది ఒరిజినల్‌ సరుకు అనేది ఎలా తెలుస్తుంది? షాపులన్నీ టీడీపీ నేతలవే అయినప్పుడు వారెందుకు క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి నకిలీ మద్యం బాటిళ్లను పట్టిస్తారు? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని పోతిన మహేష్‌ నిలదీశారు.

గత ప్రభుత్వంలో క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేశాకే మద్యం విక్రయం జరిగేదని, నాడు ప్రభుత్వ ఆ«దీనంలో పారదర్శకంగా లిక్కర్‌ అమ్మకాలు జరిగాయని చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే నకిలీ లిక్కర్‌ దొంగలను శిక్షించాలన్నారు.  

లూజ్‌ లిక్కర్‌కు క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ ఎలా?  
‘పర్మిట్‌ రూమ్‌లతో నకిలీ మద్యం అమ్మకాలు పెరుగుతాయా, తగ్గుతాయా? అక్కడ లూజ్‌ లిక్కర్‌కు క్యూర్‌ కోడ్‌ స్కాన్‌ అవకాశం ఉంటుందా? గత ప్రభుత్వంలో గొంతు చించుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఇçప్పుడు నోరెత్తరేం’ అని పోతిన ప్రశ్నించారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)