Breaking News

అంబులెన్స్‌లోనే హైదరాబాద్‌కు ముద్రగడ

Published on Mon, 07/21/2025 - 06:53

అనారోగ్యంతో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభాన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలిస్తున్నారు. సోమవారం అంబులెన్స్‌లోనే రోడ్డు మార్గం గుండా ఆయనను కుటుంబ సభ్యులు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. 

సాక్షి ప్రతినిధి, కాకినాడ/హైదరాబాద్‌: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మ­నా­భంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. తొలుత ఎయిర్‌ ఆంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి తరలించాలని అనుకున్నారు. అయితే చివరకు రోడ్డు మార్గం గుండానే తీసుకొస్తున్నట్లు సమాచారం.  

అనారోగ్యంతో అస్వస్థతకు గురైన పద్మ­నాభంకు రెండు రోజులుగా కాకినాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై వదంతులు ప్రచారంలోకి రాగా.. కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. అదే సమయంలో ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో ఆరా తీశారు. వైద్యుల సూచన మేరకు అవసరమైతే ఎయిర్‌లిఫ్ట్‌ చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలకు జగన్‌ చెప్పారు. 

అయితే.. ఈ ఉదయం ముద్రగడ కోరిక మేరకు తొలుత కిర్లంపూడి నివాసానికి ఆంబులెన్స్‌లో కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడి నుంచి ఆంబులెన్స్‌లోనే హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.  

జగన్‌కు కృతజ్ఞతలు: ముద్రగడ తనయులు
తమ తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ముద్రగడ కుమారులు బాలు, గిరిబాబులు కృతజ్ఞతలు తెలియజేశారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని, తరలింపు నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందవద్దని వారు కోరుతున్నారు. జగన్ సూచన మేరకు ఇవాళే హైదరాబాద్‌కు తమ తండ్రిని తరలిస్తామని ప్రకటించారు. 

ముద్రగడ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం ముద్రగడ తనయుడు, పార్టీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్‌ గిరిబాబును ఫోన్‌లో పలకరించారు. పద్మనాభం ఆరోగ్య పరి­స్థితి, కాకినాడ ఆస్పత్రిలో అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుకున్నారు. మెరు­గైన వైద్యం కోసం అవసరమైతే ఎయిర్‌ అంబులెన్స్‌­లో హైదరాబాద్‌ తరలించేందుకు ఏర్పాటు చేస్తామని, ఆందోళన చెందవద్దని భరో­సా ఇచ్చారు. 

ఈ క్రమంలో కాకినాడ వైద్యు­లూ హైద­రాబాద్‌ తీసుకువెళ్లడం మంచిదని చెప్పారు. ఈ విషయాన్ని తెలు­సు­కున్న జగన్‌మోహన్‌రెడ్డి సాధ్యమైనంత త్వరగా ముద్రగడను ఎయిర్‌ అంబులెన్స్‌­లో తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని పార్టీనే­తలకు సూ­చించారు. అదివారం రాత్రి తరలించేందుకు సాంకేతికంగా ఇబ్బంది ఉండటంతో ఇవాళ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)