Breaking News

కూటమి సర్కార్‌ నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలికావాలా?: జూపూడి

Published on Sun, 02/23/2025 - 16:52

సాక్షి, తాడేపల్లి: నిరుద్యోగ యువతపై కూటమి ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌ నిలదీశారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో నిరుద్యోగులేమైనా బిక్షగాళ్ళా? అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చేతిలో నిరుద్యోగులు మోసానికి గురయ్యారన్నారు. ఏపీలో ప్రభుత్వం ఉందా? ఉంటే ఎవరి కోసం పనిచేస్తోందంటూ దుయ్యబట్టారు.

‘‘ప్రభుత్వ తీరుతో నిరుద్యోగులు చాలా జీవితం కోల్పోతున్నారు. గందరగోళం సృష్టించడం కోసం ప్రభుత్వం ఉండకూడదు. కూటమి ప్రభుత్వమంటే పెద్ద అబద్ధం. ఉద్యోగాలు ఇవ్వడం చేతగాని కూటమి ప్రభుత్వం అవసరమా?. గ్రూప్‌-2 అభ్యర్థులను తీవ్ర కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేశారు. నిరుద్యోగుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లింది. అబద్ధపు హామీలతో నిరుద్యోగులను మోసం చేశారు. చిన్న అంశాన్ని తేల్చుకోలేక నిరుద్యోగులను బలిచేస్తారా?. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలికావాలా?. 40 ఏళ్ల సీనియర్.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ నా వినడం లేదంటాడు. సీఎం మాట ఏపీపీఎస్సీ ఛైర్మన్ వినకపోవడమేంటి?’’ అంటూ జూపూడి ప్రశ్నించారు.

‘‘సీఎంగా చంద్రబాబు అన్ ఫిట్. రోస్టర్ విధానంలో లోపాలున్నాయంటున్నారు. లోపాలుంటే ఎందుకు సరిచేయలేకపోతున్నారు. వైఎస్‌ జగన్‌పై అపవాదు వేయాలని చూస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయ్యింది గాడిదలు కాస్తున్నారా? ఇన్ని రోజులూ. గందరగోళం సృష్టించడానికి కాదు.. మీకు అధికారం ఇచ్చింది. పది రోజుల నుంచి అభ్యర్ధుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎగ్జామ్‌కి ఒక రోజు ముందు నారా లోకేష్ ట్వీట్ చేశారు. మరుసటిరోజు చంద్రబాబు ఆడియో లీక్ చేశారు. సీఎం మాట విననప్పుడు  ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను తక్షణమే ఆమెను తొలగించండి’’ అంటూ జూపూడి ప్రభాకర్‌ అన్నారు.

ఇంత గందరగోళం నడుస్తుంటే.. ఏపీపీఎస్ ఛైర్మన్ ఎందుకు నోరువిప్పడం లేదు. వైఎస్‌ జగన్‌ బయటికెళితే కేసు. ఆయనకి సెక్యూరిటీ తీసేస్తారు. నిరుద్యోగుల తరపున మాట్లాడితే అరెస్టులు. చిన్న సమస్యకు పరిష్కారం చూపలేనోళ్లు పోలవరం కడతారంట. చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీ స్వతంత్రంగా పనిచేసిన చరిత్ర లేదు. నిరుద్యోగులకు వచ్చిన చిన్న సమస్యను పరిష్కరించలేకపోయారు. నిరుద్యోగులు టెర్రరిస్టులు కాదు. ప్రభుత్వమే నిరుద్యోగుల గొంతు కోసేస్తే ఎలా?. నిరుద్యోగుల తరపున వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది.. ఉద్యమాన్ని చేపడతాం. చంద్రబాబు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి’’ అని జూపూడి ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)